Superstar offered Rs 3 crore for Actress Abduction | హీరోయిన్ కిడ్నాప్ కి 1.50 కోట్లు.. వీడియో తీస్తే డబుల్

Kerala police prosecution in actress abduction case

Actress Abduction Case, Kerala High Court, Malayalam Actor Dileep, Kerala Police, Dileep Pulsar Suni Contract, Dileep Supari Pulsar Suni

The prosecution in the actress abduction case on Wednesday informed the Kerala high court that arrested Malayalam actor Dileep had offered Rs 3 crore for abduction of the actress in February this year. The prosecution informed that Dileep offered Pulsar Suni Rs 1.50 crore for carrying out the abduction, and in case he gets caught in the act by the police, the compensation would be doubled. The actress was abducted while on way by road from Thrissur to Kochi.

భావన లైంగిక వేధింపుల కోసం 3 కోట్లు!

Posted: 09/28/2017 07:58 AM IST
Kerala police prosecution in actress abduction case

మళయాళ నటి భావన కిడ్నాప్ ఉదంతంలో హైకోర్టులో పోలీసులు నివేదికను సమర్పించారు. లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ ప్రధాన నిందితులు పల్సర్ సునికి హీరో దిలీప్ 3 కోట్ల రూపాయలతో సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

ప్రాసిక్యూషన్ సందర్భంగా పోలీసులు కేరళ హైకోర్టుకు ఈ నివేదికను సమర్పించారు. ముందుగా భావనను అపహరించేందుకు సుపారీ 1.50 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారని, ఒకవేళ పట్టుబడితే మిగిలిన కోటిన్నర ఇస్తానని దిలీప్ ఒప్పందం చేసుకున్నట్టు వారు వెల్లడించారు. దీంతో జడ్జి విచారణను తదుపరి వాదనకు వాయిదా వేశారు.

దీంతోనే గత ఫిబ్రవరి 17న కొచ్చిలో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న భావనను కారులో కిడ్నాప్ చేసి, వేధించారని, ఆ వేధింపుల గురించి బయటపెట్టకుండా ఉండేందుకు వీడియో తీశారని వెల్లడించింది. భావన ఫిర్యాదుమేరకు పల్సర్ సునీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసుతో ప్రమేయమున్న మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వారు వెల్లడించిన వివరాలతో పాటు, అనుమానితుడి జాబితాలో ఉండడంతో జూలై పదిన దిలీప్ ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి నాలుగు సార్లు దిలీప్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా, న్యాయస్థానం ఆయనకు బెయిల్ తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles