Ram Charan Upasana Dance at Bathukamma Celebrations | బతుకమ్మ సంబరాల్లో చిందులేసిన చెర్రీ-ఉప్పీ

Ram charan upasana bathukamma dance

Ram Charan, Upsana, Bathukamma Celebrations, Charan Upsana Bathukamma Dance, Ram Charan Bathukamma Celebrations, Ram Charan Upasana Dance

Mega Power Star Ram Charan and Wife Upasana Participates Bathukamma Celebrations. Cherry and Uppi at Vijaynagar Colony Bathukamma Celebrations.

బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్, ఉపాసన సందడి

Posted: 09/29/2017 05:09 PM IST
Ram charan upasana bathukamma dance

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ డిస్కస్ సెలబ్రిటీ జంటల్లో ఒకరు మెగా పవర్ స్టార్ రాంచరణ్, అతని సతీమణి ఉపాసన. వీరిద్దరి అన్యోన్యం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. రంగస్థలం 1985 చిత్రం షూటింగ్ లో భర్త బిజీగా ఉంటే.. ఒంటరితనం భరించలేని ఉపాసన తాను షూటింగ్ కు వెళ్లిపోవటం.. అక్కడ షూటింగ్ అయ్యాక జాలీగా గడపటం చూశాం.

ముఖ్యంగా చెర్రీ తెలంగాణ అధికారపక్ష నేతలైన కేటీఆర్, కవితలతో మంచి ఫ్రెండ్ షిప్ మెయింటెన్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ మ‌హిళ‌లు స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌ను ఘ‌నంగా జరుపుకున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌ విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలిక నిల‌యం ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ సంబురాల్లో వీరిద్దరు పాల్గొన్నారు. బాలిక‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడారు. ఈ సంద‌ర్భంగా డ్యాన్స్ వేసి అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు.

ఈ విష‌యాన్ని ఉపాస‌న త‌న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌తో క‌లిసి ఫొటోలు దిగ‌డానికి గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలికలు ఉత్సాహం చూపించారు. ప్రస్తుతం రాంచరణ్ సుకుమార్ సినిమాలో పాల్గొనటంతోపాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాకు నిర్మాతగా మారి ఆ చిత్ర పనులు కూడా చూసుకుంటున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles