Prabhas Extends His Support to Modi's Campaign | ప్రభాస్ ఫేస్ బుక్ లో రియాక్షన్ చూడండి

Prabhas reaction to modi letter

Prabhas, Prime Minister Narendra Modi, Baahubali Swachhata Hi Seva, Prabhas Swachhata Hi Seva, PM Modi Tollywood Hero, Prabhas Facebook Post

Tollywood Top Hero Prabhas extends his full support to Prime Minister Narendra Modi’s “Swachhata Hi Seva” movement, adding that he sees the Clean India campaign not as a duty but as a habit in a facebook Post.

మోదీ లేఖకు ప్రభాస్ రియాక్షన్

Posted: 09/29/2017 04:37 PM IST
Prabhas reaction to modi letter

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజు ఎట్టకేలకు ప్రధాని న‌రేంద్ర మోదీ పిలుపునకు స్పందించాడు. క్లీన్ ఇండియాలో భాగంగా తాను పాలు పంచుకుంటానని తెలిపాడు. ఇటీవ‌ల క్లీన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా స్వచ్ఛ్ భార‌త్ ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌చారం చేయాల‌ని కొంత‌మంది ప్ర‌ముఖుల‌కు ప్ర‌ధాని మోదీ వ్య‌క్తిగ‌తంగా లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై స్పందించిన ప్రభాస్ `స్వ‌చ్ఛ‌తా హై సేవ‌` విప్ల‌వానికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు బాహుబ‌లి ప్ర‌భాస్ ప్ర‌క‌టించాడు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం ఒక ప‌నిగా కాకుండా అల‌వాటుగా మార్చుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ పూనాడు. ఈ లేఖ‌పై స్పందిస్తూ - `స్వ‌చ్ఛ‌త కోసం పాటుప‌డిన మ‌హాత్మాగాంధీ జ‌యంతి త్వ‌ర‌లో రానుంది. ఆ సంద‌ర్భాన్ని అవ‌కాశంగా తీసుకుని స్వ‌చ్ఛ‌త‌కు, ప‌చ్చ‌ద‌నానికి నా వంతు ప్ర‌చారం క‌ల్పించ‌డానికి కృషి చేస్తాను` అని ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

ఇప్ప‌టికే మోహన్ లాల్, ర‌జ‌నీకాంత్‌, రాజ‌మౌళితో పాటు మ‌రికొంత మంది ప్ర‌ముఖులు ప్ర‌ధాని లేఖ‌కు స్పందిస్తూ త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే. చూద్దాం అక్టోబర్ 2 దాకా సమయం ఉంది కాబట్టి వీళ్లు ఎలా పాల్గొనబోతున్నారో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles