Dulquer Salmaan Solo Movie Get Hit Talk | సోలోగా సల్మాన్ ఇరగదీశాడంట!

Another hit for dulquer salman

Dulquer Salmaan, Solo Movie, Bejoy Nambiar, Dulquer Another Block Buster, Bejoy Nambiar Movie, Solo Movie 2017, Solo Malayalam Movie Hit

Dulquer Salmaan Solo Movie Gets Hit Talk. Solo' is anthology of four stories in which Dulquer plays the protagonis. Bejoy Nambiar Direction for this Musical Wonder.

దుల్కర్ సోలో మూవీకి హిట్ టాక్

Posted: 10/06/2017 03:03 PM IST
Another hit for dulquer salman

సౌత్ లో టాలెంట్ ఆర్టిస్ట్ లు ఎక్కువగా ఉంటారని మళయాళ చిత్రపరిశ్రమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి మాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ కూడా ఓ సూపర్ స్టారే. పేరుకు మెగాస్టార్ మమ్మూటీ కొడుకు అయినప్పటికీ వరుస హిట్లతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇప్పటికీ లవర్ బాయ్ గా అతగాడికి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

అలాంటి దుల్కర్ తాజా చిత్రం సోలో ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ కైవసం సొంతం చేసుకుని వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.మాతృకలో రిలీజ్ అయినప్పటికీ.. తమిళ్ లో మాత్రం కోలీవుడ్ ఆందోళన నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడింది.

కొత్త లుక్కుతో సల్మాన్ డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన విలక్షణమైన నటన అందరినీ ఆకట్టుకుని తీరుతుందని చెబుతున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో ఆయన సరసన కథానాయికలుగా నేహాశర్మ (చిరుత ఫేం), ధన్సిక, శ్రుతి హరిహరన్, ఆర్తి వెంకటేశ్ లు హీరోయిన్ గా నటించారు. దర్శకుడు బిజోయ్ నంబియార్ అందించిన బలమైన కథ కూడా సినిమాకు మరో ఆకర్షణగా మారటంతో దుల్కర్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles