Roja Reacted to RGV's Lakshmi's NTR Offer | లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చేస్తుందంట.. కాకపోతే

Roja on rgv s offer

Actress Roja, Director Ram Gopal Varma, Lakshmi's NTR Movie, YSR Congress Party Lakshmi's NTR, Lakshmi's NTR Producer, Lakshmi's NTR Movie Lead Roles, Lakshmi's NTR Prakash Raj

Actress and MLA Roja Responded over Director Ram Gopal Varma's Offer in Lakshmi's NTR Movie. If Good Role Offered she will ready to do it. RGV raises hackles with NTR film plan. But, Before this Roja asserts YSRCP has nothing to with RGV's movie Lakshmi's NTR.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై రోజా రియాక్షన్

Posted: 10/11/2017 10:07 AM IST
Roja on rgv s offer

లెజెండరీ ఎన్టీఆర్ బయోపిక్ పై మాట మార్చి దానిని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా మార్చి మరోసారి సంచలనమే రేపాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవిత చరిత్ర మహాగ్రంథం అని.. అందులోని కొన్ని అంశాల ఆధారంగా మాత్రమే త్వరలో సినిమా తెరకెక్కిస్తానని వర్మ చెప్పుకొచ్చాడు. దీనికి వైసీపీ నేత ఒకరు నిర్మాతగా మారటం కూడా తెలిసిందే.

అయితే సినిమాలో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తపై వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. మంచి పాత్ర ఇస్తే చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అయితే వర్మ తనను ఏ పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో తనకు తెలియదన్నారు. ఆయనను కలిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

రాంగోపాల్ వర్మ మంగళవారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిర్మించనున్న వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలోని పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో మంచి పాత్ర ఉంటుందని చెప్పారు. వర్మ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించిన రోజా మంచి పాత్ర ఇస్తే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు.

అయితే సినిమాకు.. పార్టీ పరంగా ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు కూడా. బాలీవుడ్ దిగ్గజ నటుడు శతృఘ్నసిన్హా పాత్రతో ఓ పోస్టర్ వదిలినప్పటికీ.. ప్రకాశ్ రాజ్ తో ఎన్టీఆర్ రోల్ చేయించే ఫ్లాన్ లో వర్మ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ నడిచింది. దీనిపై వర్మ తాజాగా తన ఫేస్ బుక్ లో స్పందించాడు. ప్రకాశ్ రాజ్, రోజాలపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నిర్మాత వైసీపీ కి చెందిన వ్యక్తి యాధృచ్ఛికమే తప్ప.. ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని తేల్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles