Samantha Life Goal Act under Mani Ratnam Direction | ఎలాంటి రోల్ అయినా పర్వాలేదు. ఆయన డైరెక్షన్ లో ఛాన్స్ చాలు

Samantha about classic director

Actress Samantha, Samantha Raaju Gari Gadhi 2 Interview, Samantha Mani Ratnam, Samantha Favorite Director, Samantha Dream Role

Samantha about her Favorite Director Mani Ratnam. Recently at Raju Gari Gadhi 2 she wants to act under that Classic Director in life time.

మణి రత్నం సినిమాలో నటించటం నా కల : సమంత

Posted: 10/20/2017 06:29 PM IST
Samantha about classic director

సౌత్ బ్యూటీ సమంతకు ఈ దీపావళి చాలా స్పెషల్. ఓవైపు అక్కినేని ఇంటి కోడలిగా హోదా దక్కటంతోపాటు.. రాజుగారి గది-2తో మంచి హిట్ సాధించింది. అదే ఊపులో ప్రమోషన్ లో హుషారుగా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలను చెబుతోంది.

అయితే ఎలాగైనా సరే తన డ్రీమ్ దర్శకుడితో సినిమాలో నటించే కోరిక తీరాలని బలంగా కోరుకుంటోంది. ఇంతకీ ఆమె ఫేవరెట్ దర్శకుడు ఎవరో తెలుసా? క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం. సామ్ ను ఇండస్ట్రీలో గుర్తించేలా చేసింది గౌతమ్ మీననే అయినా, మెంటర్ డైరెక్షన్ లో కన్నా మణిసర్ సినిమాలోనే నటించాలన్న కోరుకుంటుందంట. గతంలో ఓ మల్టీస్టారర్ చిత్ర అనౌన్స్ మెంట్ సమయంలో ఆ కోరిక నెరవేరుతుందని ఆశించినప్పటికీ.. ఆ ప్రాజెక్టు రద్దు కావటంతో అప్ సెట్ అయ్యిందని చెబుతోంది.

ఇప్పుడు ఎలాగూ పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి, త్వరలోనే ఆమె కల నెరవేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్ రంగస్థలం, మహానటి చిత్రాలతోపాటు కోలీవుడ్ లో విజయ్ సేతుపతి,విశాల్ తో ఓ సినిమాలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles