Raviteja-Rana in Vikram Vedha Remake | వెంకీ అవుట్.. మాస్ రాజా-రానా మల్టీస్టారర్ కన్ఫర్మ్?

Rana raviteja confirms remake

Vikram Vedha, Vikram Vedha Telugu Remake, Vikram Vedha Raviteja, Vikram Vedha Raviteja Rana, Raviteja Rana, Raviteja Rana Movie, Raviteja Replaces Venktesh, Venky Out From Rana Movie

Madhavan-Vijay Sethupathi's Vikram Vedha to be remade in Telugu. Intially Rana, Venkatesh in talks for 'Vikram Vedha' Telugu remake. Later Raviteja replaces Venky for Vijay Sethupathi Role.

రవితేజ-రానా మల్టీ స్టారర్ ఖరారు?

Posted: 10/26/2017 10:48 AM IST
Rana raviteja confirms remake

బాహుబలి ఎఫెక్ట్ తో దాదాపు ఇండియాలోని అన్ని భాషల్లో సరైన హిట్ పడకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో హిందీలో ఈ మధ్యే గోల్ మాల్ రిటర్న్స్ కలెక్షన్లు ఊరటనివ్వగా.. తమిళ్ లో మెర్సల్ కలెక్షన్లు.. టాక్ ఎలా ఉన్నా... మూడు నెలల క్రితమే విక్రమ్ వేదాతో ఆ లోటు తీరింది.

మాధవన్-విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం అక్కడ బిగ్ బ్లాస్ బస్టర్ గా నిలిచింది. ఓ గ్యాంగ్ స్టర్ అండ్ పోలీసుల మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొన్నామధ్య దగ్గుబాటి హీరోలు వెంకటేష్-రానాలతో విక్రమ్ వేదా చిత్రం తెరకెక్కించాలనే ఫ్లాన్ వేసినట్లు అధికారికంగా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు బాబాయ్ ప్లేస్ లో మరో సీనియర్ హీరో వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

వెంకీ ప్లేస్ లో రవితేజ పేరు వినిపిస్తోంది. విజయ్ సేతుపతి చేసిన పాత్రలో రవితేజ .. మాధవన్ పాత్రలో రానా కనిపించబోతున్నారని చెప్పుకుంటున్నారు. తమిళంలో పుష్కర్ - గాయత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. తెలుగులో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రవితేజ టచ్ చేసి చూడు.. రానా ఓ తమిళ్, ఓ కన్నడ చిత్రాలతో బిజీగా ఉండటంతోపాటు వెంకీ-తేజ ప్రాజెక్టులో ఓ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles