బాహుబలితో తెలుగు చలన చిత్ర స్థాయి ఖ్యాతి పెరగటం ఏమోగానీ, కొన్ని ఇండస్ట్రీలు మన చలన చిత్ర పరిశ్రమపై దారుణంగా విషం కక్కటం చూశాం. ఈ మధ్య రియాల్టీ షోల విషయంలోనూ టీఆర్పీలతో హిందీకి మనం ఏ మాత్రం తీసిపోమని చాటిచెప్పటం చూశాం. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ బుల్లితెర నటి సౌత్ సినిమాలపై దారుణమైన వ్యాఖ్యలు చేసింది.
‘బిగ్ బాస్’ సీజన్ -11 లో సీరియల్ నటి హీనాఖాన్ కాంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. యె రిష్తా క్యా కహ్తా హై లో అక్షర పాత్ర ద్వారా పాపులర్ అయిన ఈ భామ ఒకానోక టైంలో ఏషియన్ సెక్సీయెస్ట్ ఉమెన్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది.బిగ్ బాస్ లో పాల్గొంటున్న ఆమె దక్షిణాది భామలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసింది. పైగా తనకు సౌత్ సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ(సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో...) వదిలేశానని చెప్పింది.
ఈ క్రమంలో దక్షిణాది ముద్దుగుమ్మ హన్సిక కూడా హీనాఖాన్ పై మండిపడింది. హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీనాఖాన్ కు హితవు పలికింది. బాలీవుడ్ కు చెందిన పలువురు నటీమణులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పనిచేశారని, ప్రస్తుతం పనిచేస్తున్నారనే విషయం హీనాఖాన్ కు తెలియదా? అని ప్రశ్నించింది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన హీనా ఖాన్ సిగ్గు పడాలని, ఆమె చెప్పిన మాటలన్నీ పనికిమాలిన మాటలేనని పేర్కొంది. తాను దక్షిణాది నటిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని హన్సిక తన వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చింది.
What is this suppose to even mean?How can she even degrade south industry like this ? #shamehinakhan (cont) https://t.co/6ByNcYt8yI
— Hansika (@ihansika) October 26, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more