Huge Released for Vijay's Adirindhi Movie | రిలీజ్ అదిరింది.. మరి కలెక్షన్లో?

Adirindhi release in telugu theaters

Adirindhi, Adirindhi Movie, Adirindhi Release, Adirindhi Screens, Adirindhi Theaters, Adirindhi First Day Collections, Adirindhi Movie Review

Huge Release for Vijay's Adirindhi in Telugu States-Area wise screen counts. The Original Mersal Collects 225 Crores till now.

భారీ ఎత్తున్న అదిరింది రిలీజ్

Posted: 11/09/2017 11:44 AM IST
Adirindhi release in telugu theaters

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తమిళనాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుమారు 225 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం ఈ యేడాది కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవటమే కాదు.. ఇదయ దళపతి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో తెలుగులో అదిరింది పేరుతో చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అధినేత శరత్ మరార్ ఈ చిత్ర డబ్బింగ్ హక్కులను తీసుకుని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే సమస్య ఏంటో తెలీదుగానీ ఒకేసారి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కాస్త లేట్ అయ్యింది.

ఎట్టకేలకు నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే రిలీజ్ కోసం భారీగా థియేటర్లు కేటాయించటం ఆసక్తికరంగా మారింది. అదిరింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 400 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మొదటిసారి విజయ్ చిత్రం కోసం ఇంతగా ఇన్ని థియేటర్లు కేటాయించటం విశేషం. విజయ్ గత చిత్రం ఏజెంట్ భైరవా(తమిళ్ లో భైరవ)తొలిరోజు 50 లక్షలు మాత్రమే రాబట్టింది. దీంతో భారీ ఎత్తున్న రిలీజ్ అవుతున్న అదిరింది ఎంత వసూలు చేస్తుందో చూడాలి. అయితే చిత్రం వివాదాస్పదం కావటంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయనే ధీమాలో నిర్మాత ఉన్నారు.

ఆస్పత్రి కట్టించి ప్రజలకు సేవలందించాలన్న ఓ వ్యక్తిని, అతని కుటుంబాన్ని కొందరు వ్యక్తులు కుట్రపన్ని హత్య చేస్తారు. అయితే చనిపోయారనుకున్న అతని ఇద్దరి కొడుకులు(కవలలు) మాత్రం ప్రాణాలతో బయటపడతారు. వారు పెద్దయ్యాక తమ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి, అతనికి సహకరించిన వారిని చంపి ప్రతీకారం తీర్చుకోవటం.. దానికి అదనంగా డాక్టర్లు దేవుళ్లుగా ఉండాలంటూ  వైద్య రంగం గురించి సందేశాత్మకంగా  అదిరింది చిత్రం తెరకెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adirindhi  Actor Vijay  అదిరింది  నటుడు విజయ్  

Other Articles