Pawan Kalyan Agnathavasi Audio Date Fixed | అజ్ఞాతవాసి పాటల తేదీ ఖారారు.. వేదిక అదేనా?

Pawan kalyan agnathavasi audio details

Pawan Kalyan, PSPK 25 Audio, Pawan Kalyan Agnathavasi Audio, Agnathavasi Amaravati Audio, Agnathavasi Pawan Kalyan, Pawan-Trivikram Audio Launch

Pawan Kalyan 25th Movie Audio will launch at Amaravati. The title Agnathavasi consider this movie First look also released before North India Schedule.

అజ్ఞాతవాసి ఆడియో డేట్ ఖరారు

Posted: 11/21/2017 03:21 PM IST
Pawan kalyan agnathavasi audio details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి ఆడియో విషయంలో ఓ స్పష్టత వస్తోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి వారణాసిలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

వచ్చేనెల 15వ తేదీన ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఈ ఫంక్షన్ ను 'అమరావతి'లో జరపడానికి ప్లాన్ చేస్తున్నారనేది తాజా సమాచారం.అయితే ఆ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక చిత్ర యూనిట్ నార్త్ ఇండియా టూర్ కు వెళ్లే లోపే చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్లు ఉన్నారంట. దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles