Dangal Actress resembles Katrina Kaif | దంగల్ బ్యూటీ.. కత్రినా జిరాక్స్.. ఫోటోలు వైరల్

Dangal actress similar to katrina

Fatima Sana Shaikh, Katrina Kaif, Fatima Sana Shaikh Xerox, Fatima Sana Shaikh Dupe, Fatima Sana Shaikh Katrina Kaif

Fatima Sana Shaikh shared a picture of herself from a photoshoot where she is seen donning a royal blue coloured saree and a bindi on her forehead. Katrina Kaif was seen in a similar avatar a few days back and this made the netizens compare the two actors.

అచ్చం కత్రినా కైఫ్ లా ఉన్న దంగల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్

Posted: 11/29/2017 03:22 PM IST
Dangal actress similar to katrina

దంగల్ సినిమాతో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో విమర్శలపాలైన విషయం తెలిసిందే. బికినీ, హాఫ్ శారీలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు తీవ్ర విమర్శలకు తావునిచ్చాయి. సోషల్ మీడియాలో మతం రంగు పులిమి మరీ ఆమె ఫోటోలపై తీవ్ర విమర్శలు చేశారు.

అయితే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో మాత్రం విమర్శలను కాసేపు పక్కనపెట్టి కాస్త భిన్నమైన కామెంట్లకు తావునిచ్చింది. అందుకు కారణం చీరకట్టులో ఆమె పోస్ట్ చేసిన చీర లుక్కు అచ్చం కత్రినా కైఫ్ లా ఉండటమే. చీర‌క‌ట్టులో సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఉన్న కొన్ని ఫొటోల‌ను ఫాతిమా పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అచ్చం క‌త్రినా కైఫ్‌లాగే క‌నిపిస్తోంది.

కొన్నాళ్ల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో కత్రినా ఓ ఫోటో షేర్ చేసింది. ట్రెడిషన్ లుక్కులో ఉన్న ఆ ఫోటోను.. ఇప్పుడు ఫాతిమా ఫోటోలను చూస్తున్న ప్రతీ ఒక్కరూ బాలీవుడ్ కు మరో కత్రినా దొరికినట్లేనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్, అమితాబ్ లతో ఆమె థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles