బాహుబలికి మరో అరుదైన గౌరవం దక్కింది. సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానెల్ ఏటా ఇచ్చే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 2017 సంవత్సరానికి గానూ ఎంపికైంది.
గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా నటి రమ్యకృష్ణ, నిర్మాత యార్లగడ్డ శోభులు ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బాహుబలి-3 ఉంటుందా? అన్న ప్రశ్నకు శోభు యార్లగడ్డ సమాధానమిస్తూ.. త్వరలో ఉండకపోవచ్చని.. కానీ, ఎప్పటికైనా తెరకెక్కించి తీరతామని ప్రకటించాడు. ఇక రమ్యకృష్ణ మాట్లాడుతూ, బాహుబలిలో నటించిన అనుభవం జీవితాంతం గుర్తుంటుందని అన్నారు.
సాధారణంగా ఈ అవార్డును వ్యక్తిగతంగా సీఎన్ఎన్ ప్రకటిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏడాది బాహుబలి చిత్ర యూనిట్ మొత్తానికి ప్రకటించటం విశేషం. 2015లో ఇదే అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకున్నాడు. ఇక ఈ కార్యక్రమానికి కపిల్ దేవ్, కోహ్లీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more