Vishal asks President and PM for Nomination Rejection | నామినేషన్ తిరస్కరణపై రాష్ట్రపతి, ప్రధాని లకు విశాల్ విజ్ఫప్తి

Vishal about nomaination rejection

Hero Vishal, RK Nagar By Election, Nomination Reject, President Ramnath Kovind, PM Narendra Modi, Hero Vishal Tweets, హీరో విశాల్, ఆర్కే నగర్ ఉప ఎన్నిక, వరుస ట్వీట్లు

Vishal Serial Tweets about his nomination rejection after for RK Nagar By Poll rejection.

నామినేషన్ తిరస్కరణపై నటుడు విశాల్ ఆవేదన

Posted: 12/06/2017 01:16 PM IST
Vishal about nomaination rejection

అనూహ్య పరిణామాల మధ్య నటుడు విశాల్ నామినేషన్ తిరస్కరణ రాత్రంతా హాట్ టాపిక్ గా మారింది. తిరస్కరణ.. అంగీకారం.. ఆపై మళ్లీ తిరస్కరణతో నటుడు విశాల్ తీవ్ర నిరాశ చెందాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, జరిగిన విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రాత్రి నుంచి తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

డిసెంబర్ 5న అమ్మ చనిపోయిందని.. అదే రోజు ప్రజాస్వామ్యం కూడా చనిపోయిందంటూ ట్వీట్ చేశాడు. కాగా, నేటి ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. "ప్రజల నుంచి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వరకూ నేను అభ్యర్థిస్తున్నాను. నా పేరు విశాల్. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల వేళ, ఏం జరుగుతూ ఉందో మీకందరికీ తెలుసునని భావిస్తున్నాను. నా నామినేషన్ ను తీసుకుని, తిరస్కరించి ఆపై అంగీకరించి, మళ్లీ తిరస్కరించారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. న్యాయం నిలుస్తుందని భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

కాగా, నామినేషన్ పత్రాల్లో విశాల్ కు మద్దతుగా సంతకం చేసిన ఇద్దరి వివరాలు సరిగ్గా లేకపోవటం.. పైగా విశాల్ ఇచ్చిన మధుసూధన్ బెదిరింపు వివరణ తర్వాత అవాస్తవమని తేలటంతోనే విశాల్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles