Gautham Menon injured in road accident | గౌతమ్ మీనన్ కు యాక్సిడెంట్.. ఆ సమయంలో తాగిలేడంట!

Gautam menon accident details

Director Gautham Menon, Road Accident, Gautham Menon Accident, Director Met Accident, Dhruva Natchathiram Director, Gautham Menon Drunk and Drive

Director Gautham Menon met with an accident while he was travelling Mahabalipuram to Chennai. It is reported that his car collided with a tanker lorry and he rammed his car into the centre median during the early hours of Thursday. However, Gautham escaped with minor injuries.

గౌతమ్ మీనన్ కు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు

Posted: 12/08/2017 08:38 AM IST
Gautam menon accident details

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం ఉదయం చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతింది. చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, తొలుత ఆయన మద్యం సేవించి వాహనం నడిపారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే కాసేపటికే అదంతా వైద్యులు ఉత్తదేనని తేల్చటంతో ఆ వార్తలను సవరిస్తూ మీడియా వార్త ప్రసారం చేయటం విశేషం.

కాగా, తమిళం, తెలుగు భాషలలో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం హీరో విక్రమ్ తో ‘ధ్రువ నక్షత్రం’తో పాటు, సందీప్ కిషన్ హీరోగా తమిళంలో ‘నరగసూరన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles