పది సెకన్లలో వంద ఎక్స్ ప్రెషన్లు చూపించే నటిగా సావిత్రికి గుర్తింపు ఉంది. అలాంటి నటి జీవితచరిత్రను 'మహానటి' పేరిట తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ మద్యే టైటిల్ లోగో విడుదల చేసి మార్చి 29న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
ఇక ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను చిత్ర నిర్మాత స్వప్న దత్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ చిత్రం కథ అంతా పూర్తయ్యాక నటీనటుల ఎంపిక ప్రారంభించాం. అయితే ముందుగా సమంతను తీసేసుకున్నాం. తర్వాతే లీడ్ పాత్ర కీర్తి సురేశ్ ఎంపిక జరిగింది. సినిమాకు కీర్తి పాత్రే ఎంతో.. సమంత పాత్ర కూడా అంతే. సినిమా రిలీజ్ అయ్యాక ఆ విషయాన్ని మీరు కూడా ఒప్పుకుంటారు అని స్వప్ప చెబుతోంది. ఆ మధ్య ఆమె జమున పాత్రలో కనిపిస్తుందని చెప్పుకున్నప్పటికీ.. ఇప్పుడు స్వప్న వ్యాఖ్యలతో ఆ ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.
సావిత్రి జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆమె కూతురు విజయ చాముండేశ్వరి దగ్గర నుంచి సేకరించాం. ఎంతో అరుదైన ఫోటోలు, వీడియోలను కూడా ఆమె మాకు అందించారు. ఈ సినిమా కోసం చేసిన గ్రౌండ్ వర్క్ అంతా ఇంతా కాదు అని ఆమె వివరించింది. ఆయా పాత్రల కోసం నటీనటుల ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేశామని ఆమె వివరించింది. తెలుగుతో పాటు తమిళ .. మళయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుందని ఆమె తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more