Contributions of NTR to Telugu neglected by KCR | తెలుగు మహాసభలు. ఇంతకీ ఎన్టీఆర్ ఎక్కడ?

Ntr ignored at world telugu conference

NTR, World Telugu Conference, Telangana Government, KCR, Chandrababu Naidu, LB Stadium, NTR World Telugu Conference, NTR Telugu Athma Gouravam

NTR neglected during World Telugu Conference 2017. At a time when Telugu-speaking people were being branded as Madrasis, NTR launched the party with the slogan of Telugu self-respect. Now, There is a feeling among the Telugu lovers that the legendary actor is being neglected by the Telangana government.

తెలుగు మహాసభలు.. ఎన్టీఆర్ ఎక్కడ?

Posted: 12/15/2017 03:49 PM IST
Ntr ignored at world telugu conference

తెలుగు భాషకు మరోసారి ప్రాంతీతతత్వం అడ్డుపడింది. ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుంచి భాగ్యనగరంలో వైభంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలుగు మహాసభల విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే విధంగా మహనీయుల పేరిట స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో టీడీపీ వ్యవస్థాపకుడు, నటదిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట స్వాగత ద్వారం ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది. కృష్ణా జిల్లా గరికపాడులో ఎన్టీఆర్ అభిమానులు గుండు గీయించుకుని తమ నిరసన తెలిపారు.

తెలుగుకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత కల్పించిన ఎన్టీఆర్ ను విస్మరించారని, కనీసం ఎన్టీఆర్ ఫొటో కూడా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం కరెక్టు కాదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదన్న వాదనను భాషాపండితులు కూడా వినిపిస్తున్నారు. అయితే చంద్రబాబు చోరవ తీసుకోకపోవటం మూలంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందన్న విమర్శలు వినిపిసస్తుండగా.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల మాత్రం ఇది టీ సర్కార్ నిర్లక్ష్యమేనని వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles