RGV Bold Attempt with Kadapa Trailer | ‘కడప’ బోల్డ్.. బూతు.. వర్మ బ్యాక్ టు ఫాం.. అసలు విడుదలవుతుందా?

Rgv kadapa trailer review

Ram Gopal Varma, Kadapa, Kadapa web series, Kadapa Trailer, RGV Kadapa, Varma Kadapa, RGV Bold Trailer, RGV Telugu Web Series, Shravya Reddy Kadapa

Ram Gopal Varma Kadapa Web Series Trailer Out. Bold attempt on Factionism but, Vulgarity and Violence major highlighted in Video. Shravya Reddy Boothu Dialogue in Kadapa Trailer.

చర్చనీయాంశంగా మారిన వర్మ కడప ట్రైలర్

Posted: 12/15/2017 04:30 PM IST
Rgv kadapa trailer review

వర్మ తెరకెక్కించిన “రక్తచరిత్ర” సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అయితే ఆ సమయంలో బెదిరింపులు.. కొన్ని అవాంతరాలు(సెన్సార్ ట్రబుల్స్) మూలంగా కొన్ని విషయాలు దాచిపెట్టానని వర్మ ఇప్పటికీ ఫీలవుతుంటాడు. కానీ వెబ్ మీడియాకు అలాంటి సెన్సార్ నిబంధనలు లేవు గనుక, తాజాగా “కడప” పేరుతో వెబ్ సిరీస్ ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

రాయలసీమలోని ప్రముఖ వ్యక్తులు కోట్ చేసిన విషయాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందనను తెచ్చుకుంది. నరుక్కోవటాలు, ఫ్యాక్షన్ హత్యలు, అడల్ట్ కంటెంట్, బూతు డైలాగులు మొత్తానికి మరో సంచలనానికి తెరలేపినట్లే కనపడుతున్నారు. అయితే 4 నిముషాల నిడివి గల “కడప” ట్రైలర్ పట్ల ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల నోటి నుంచి దారుణమైన డైలాగులు రావటంపై మండిపడుతున్నారు.

హిందీలో గన్స్ అండ్ థైస్ పేరిట న్యూడ్ ట్రైలర్ విడుదల చేసి సంచలనానికి తెరలేపిన వర్మ.. ఇప్పుడు వర్మ తెలుగులో చేస్తున్న బోల్డ్ అటెంప్ట్ కి మున్ముందు ఆటంకాలు ఎదురవుతాయో? చూడాలి. వర్మ నిజంగా విడుదల చేస్తారా? అనేది ఇప్పుడు కీలకాంశంగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles