Aiyaary trailer: deadly spy games between two Army officers | అయ్యారీ ట్రైలర్.. ఆర్మీ స్పై డ్రామా.. రకుల్ జస్ట్ కొన్ని సెకన్లే!

Aiyaary official trailer out

Sidharth Malhotra, Aiyaary, Aiyaary Trailer, Neeraj Pandey, Manoj Bajpayee, Rakul Preet Singh, Pooja Chopra, Aiyaary Trailer Launch, Aiyaary Movie, Aiyaary Release Date, Aiyaary Trailer Review

Sidharth Malhotra goes rogue and Manoj Bajpayee is on his trail in 'Aiyaary'. Manoj Bajpayee plays the mentor while Sidharth Malhotra plays the fugitive disciple. Aiyaary is scheduled to release on January 26, 2018 and is to clash with Akshay Kumar's PadMan.

నీరజ్ పాండే అయ్యారీ ట్రైలర్ వచ్చేసింది

Posted: 12/19/2017 06:58 PM IST
Aiyaary official trailer out

దేశభక్తి చిత్రాలు.. ఎమోషన్ కంటెంట్ తో చిత్రాలను రూపొందించటంలో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే దిట్ట. ఏ వెడ్నెస్ డే మొదలు.. బేబీ, ధోనీ ది అన్ టోల్డ్ చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి. ఈ దర్శకుడు ఇప్పుడు అయ్యారీ పేరుతో మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నాడు.

సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఓ యువ, సీనియర్ ఆర్మీ అధికారుల మధ్య చోటు చేసుకునే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. మేజర్ జై భక్షి పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా, కల్నల్ అభయ్ సింగ్ పాత్రలో సిద్ధార్థ్, మనోజ్ కనిపించనున్నారు. దేశరక్షణ కోసం సీక్రెట్ గా తన ఆపరేషన్లను జై కొనసాగిస్తే.. అది తెలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జై ను చంపేందుకు అభయ్ ప్రయత్నిస్తుంటాడు.

 

ఉగ్రదాడిలో తన ప్రాణాలను కాపాడిన జై ను చంపేందుకు అభయ్ యత్నించటం.. జై తప్పించుకుని తన ఆపరేషన్ కొనసాగించటం... వీరిద్దరి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ ఇలా ట్రైలర్ లో చూపించారు. ఈ కథలో చివరకు ఏమైంది అన్నదే నేపథ్యం.. హీరో ప్రేయసి పాత్రలో రకుల్ ప్రీత్ ను జస్ట్ సెకన్ల పాటు మాత్రమే చూపించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనోజ్ బాజ్ పాయి ముఖ్యపాత్రలో నటిస్తున్న ఆయ్యారీ జనవరి 26న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles