Malayalam actress Bhavana to get married in January 2018 | భావన పెళ్లి డేట్ వచ్చేసింది.. కానీ, ఇండస్ట్రీవాళ్లను ఒక్కరినీ పిలవదంట!

Actress bhavana wedding date fixed

Actress Bhavana, Producer Naveen, Bhavana Wedding Date, Actress Bhavana Marriage, Actress Bhavana News, Bhavana Naveen, Mallu Actress Bhavana

Malayalam actress Bhavana is all set to marry her fiancee Naveen. Ever since the couple had announced their engagement, the rumours have been abuzz as to when they will finally getting married. Certain reports mentioned they might get married on December 22, but that's not going to happen. As per the latest reports Bhavana and Naveen will get married on January 22, and this time the news is official, it seems.

నటి భావన పెళ్లి డేట్ ఫిక్స్.. ఇండస్ట్రీకి నో ఇన్విటేషన్!

Posted: 12/21/2017 06:50 PM IST
Actress bhavana wedding date fixed

తెలుగు సహా మళయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా భావన మంచి క్రేజ్ సంపాదించుకుంది. రవితేజ నిప్పు చిత్రం తర్వాత ఆమె తెలుగులో కనిపించకపోయినా.. మిగతా భాషల్లో హీరోయిన్ గా తన హవా చూపిస్తూనే వస్తోంది. ఇక ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాల తర్వాత ఆమె మానసికంగా కుంగిపోతుందని అంతా అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆమె షూటింగ్ లలో పాల్గొనటం.. అన్నింటికి మించి ప్రియుడు నవీన్ తో వివాహానికి సిద్ధపడటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ మధ్య ఆమె సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. కేరళలోని త్రిసూర్ లో మార్చి 9వ తేదీన నిర్మాత నవీన్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. దీపావళి సమయంలోనే వారి వివాహం జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఎందుకనో వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 22న జరగాల్సి ఉన్నప్పటికీ అదీ కుదరలేదు.

ఎట్టకేలకు ఇప్పుడు ఆ ముహూర్తం ఖరారైంది. జనవరి 22వ తేదీన వీరి వివాహం కేరళ - త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్' లో జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరుగుతుంది. భావన .. నవీన్ ఇద్దరూ చిత్రపరిశ్రమకి సంబంధించినవారే అయినా, వివాహ వేడుకకి ఎవరినీ పిలవడం లేదట. ఆ మధ్య తనకు అన్యాయం జరిగిన సమయంలో ఎవరూ నోరు మెదపకపోవటమే అందుకు కారణమని చెబుతున్నారు.

Actress Bahvana Wedding Card

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhavana  Naveen  నటి భావన  నవీన్  

Other Articles