మిడిల్ క్లాస్ అబ్బాయి రిలీజ్ అయ్యిందో లేదో మరో చిత్రాన్ని నెల వ్యవధిలో రిలీజ్ చేసేందుకు నాని రెడీ అయిపోతున్నాడు. కృష్ణార్జున యుద్ధంతోపాటు మరోవైపు తాను నిర్మాతగా మారి తీయబోయే చిత్రం పై కూడా కేవలం పోస్టర్లతోనే అంచనాలు పెంచేస్తున్నాడు.
ముఖ్యంగా ఈ చిత్ర తారాగణమే ఇక్కడ హైలెట్ గా మారింది. నిత్యామీనన్, కాజల్, అవసరాల శ్రీనివాస్, రెజీనా, ఈషా రెబ్బా ఇలా మెయిన్ క్యారెక్టర్ లతోపాటు మాస్ రాజా రవితేజ, నేచురల్ స్టార్ నానిలు తమ డబ్బింగ్ తో ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమా గురించి చర్చలు నడుస్తుండగా.. నాని తన కొత్త సినిమా లుక్ లో సోషల్ మీడియాలోకి దిగాడు.
నాని సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ నిర్మిస్తున్న ‘అ’ సినిమాలో అతడి పాత్రను ఈ రోజు పరిచయం చేశారు. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడు ఈ సినిమా. మనిషిగా ఉన్న నాని.. చేపగా మారిపోయాడు ఈ సినిమా కోసం. అవునండీ.. ఈ చిత్రంలో నాని పోషిస్తున్నది చేప పాత్రే. ‘అ’ టైటిల్ లోగో లాంచ్ చేసినపుడే నాని ఇందులో ఓ పాత్రకు వాయిస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత అతను వాయిస్ ఇచ్చేది ఒక చేపకు అని ప్రకటించారు. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Playing an interesting role in my next .. been learning swimming coz the script demands ;))#AWE https://t.co/VDmOAuUPHK
— Nani (@NameisNani) December 23, 2017
I know how much u worked hard on this one reg @ReginaCassandra
— Nani (@NameisNani) December 13, 2017
Wishing you a very very happy birthday from team #AWE :) https://t.co/kM0hNEmEQi
Eeshఅ :)#innocence #AWE https://t.co/RB0qiDQY0p
— Nani (@NameisNani) December 11, 2017
Ashta chamma boys are back
— Nani (@NameisNani) December 6, 2017
Srini అvasarala#AWE https://t.co/cyoiA3qimq
Ala modhalaindhi Nithyఅ! Tho ;)#AWE https://t.co/ZRWpBwQNPR
— Nani (@NameisNani) December 2, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more