Mahesh's 25th film to start rolling Earlier | మహేష్ అనుకున్నది వచ్చే ఏడాది తీరుతుందా?

Mahesh 25th movie release details

Mahesh Babu, 25th Movie, Vamsi Paidapally, Dil Raju, Bharat Ane Nenu, Koratala Siva, Mahesh Babu 2018, Mahesh Two Movies Same Year, Mahesh Babu Upcoming

Mahesh Babu 25th film will start rolling from February next year. A landmark film in his career, as it happens to be his 25th movie, it will be directed by Vamsi Paidapally. One of the most successful producers of 2017, Dil Raju will be bankrolling this mega budget movie in association with Ashwini Dutt. And May Release for Diwali Season.

వచ్చే ఏడాదిలోనే మహేష్ 25వ చిత్రం

Posted: 12/29/2017 05:26 PM IST
Mahesh 25th movie release details

మహేశ్ బాబు అభిమానులంతా తాజా చిత్రమైన 'భరత్ అనే నేను' కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కొరటాల లాంటి సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు.. పైగా హిట్ కాంబో కావటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సమ్మర్ కి విడుదల కానుంది.

ఇక ఆ తరువాత మహేశ్ బాబు .. తన మైలు రాయి 25వ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. అయితే కొరటాల శివ సినిమా కోసం ఎదురు చూడకుండా.. మధ్యలోనే వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో ఎక్కువగా జరగనుంది. అందువలన అక్కడి లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు చెబుతున్నారు.

అశ్వనీదత్ - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను, దీపావళికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి ఏడాదికి రెండు సినిమాలు అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న మహేశ్ బాబు కోరిక వచ్చే ఏడాది నెరవేరే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  25th Movie  మహేష్ బాబు  25వ చిత్రం  

Other Articles