Mega Hero Confirmed in Rana's Next | రానా చిత్రంలో వరుణ్ తేజ్ కూడా.. : డైరెక్టర్ ప్రభు

Varun tej in haathi mere saathi

Rana Daggubati, Haathi Mere Saathi, Varun Tej, Prabhu Solomon, Adavi Ramudu, Rana Varun Tej, Rana Adavi Ramudu, Varun Tej Adavi Ramudu

Varun Tej to star in Rana Daggubati’s Haathi Mere Saathi Actor Varun Tej will play a pivotal role in Rana Daggubati’s upcoming film, Haathi Mere Saathi directed by Prabhu Solomon. It is heard that, the name of the movie is going to be ‘Adavi Ramudu’ in Telugu.

రానా హథీ మేరే సాథీలో వరుణ్ తేజ్

Posted: 01/03/2018 03:04 PM IST
Varun tej in haathi mere saathi

గతేడాది దగ్గుబాటి హీరో రానాకు బాగా కలిసొచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ తో భారీ హిట్ అందుకున్నాడు. అదే సమయంలో ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు కూడా రానా కెరీర్ కు బాగా హెల్పయ్యాయి. ఈ క్రమంలో వరుసగా చిత్రాలను అంగీకరించాడు. రాజీవ్ గాంధీ హత్యపై తెరెకెక్కుతున్న చిత్రంతోపాటు.. మరో వైవిధ్యభరితమైన చిత్రంలో నటించబోతున్నాడు.

ఏనుగుల పరిరక్షణ కాన్సెప్ట్ తో ఎమోషనల్ కంటెంట్ తో కోలీవుడ్ దర్శకుడు ప్రభు సల్మొంజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఎస్ ధను చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. హిందీలో హథీ మేరే సాథీ టైటిల్ ను నిర్ణయించగా.. తెలుగు కోసం ఓ టైటిల్ ను నిర్ణయించినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ అడవి రాముడు పేరును రిజిస్ట్రర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్ హౌజ్ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక తమిళ్ లో ఈ చిత్రాన్ని డబ్ చేయబోతున్నారు.

మరోవైపు ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రభు ఈ విషయాన్ని ధృవీకరించాడు. రానాతోపాటు వరుణ్ పాత్ర కూడా ప్రాధాన్యం ఉంటుందని ప్రభు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles