Nani's Awe Movie Teaser Released | నాని అ చిత్ర టీజర్ వచ్చేసింది.. మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్సే!

Awe movie teaser out

Nani, Awe Movie Teaser, Nithya Menen, Kajal Aggarwal, Murali Sharma, Avasarala Srinivas, Awe Teaser

Nani Presents Awe Movie Teaser Released. The Movie seems to be suspense thriller.

నాని అ మూవీ టీజర్ వచ్చేసింది

Posted: 01/04/2018 05:37 PM IST
Awe movie teaser out

టాలీవుడ్ మరో ఇంట్రెస్టింగ్ మూవీ అ రూపంలో రాబోతుంది. పోస్టర్లతోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. చేపగా నాని.. చెట్టుగా రవితేజ వాయిస్ ఓవర్లతో టీజర్ మొదలైంది. అనగనగా రాజు..  ఏడుగురు కొడుకులు.. ఇలా నాని ఫీల్ తో చెబుతుంటే...  కొత్తగా చెప్పమని రవితేజ అడగటం.. వెంటనే నాని ఇది చూడు అంటూ టీజర్ ఓపెన్ చేశారు. 

నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, రెజీనా కంస్సాండ్రా, ఈషా రెబ్బ, మురళీ శర్మ... ఇలా ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ పోతూ చివర్లో అద్దంలో ముఖం చూసుకుంటున్న కాజల్ ను సీరియస్ గా చూపించేశారు. చివర్లో ఇంతకీ హీరో ఎవరో అంటే.. కథే హీరో అనటం.. దానికి రవితేజ ’అ‘ అనగానే... అదే టైటిల్ అని నాని ఫన్నీ రిప్లై ఇవ్వటం చూడొచ్చు.  వచ్చే నెలలోనే అ ప్రేక్షకుల ముందుకు రానుంది. సైలెంట్ అనే షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ అందిస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles