Kona Venkat Unhappy with Kathi Mahesh Behaviour | సైలెంట్ గా ఉండమంటే.. నవ్వే చేసిందేంటి?

Kona venkat fire on mahesh kathi

Kona Venkat, Mahesh Kathi, Pawan Kalyan Fans, Mahesh Kathi TV Channels Debate, Kona Venkat Kathi Mahesh

Kona Venkat Unhappy with Kathi Mahesh's behaviour. In Few days ago Kona Venkat's Request To Kathi Mahesh to maintain peace till January 15th. But, Mahesh participate TV Channel debates and feud with Pawan Fans again.

కత్తి మహేష్ పై కోన వెంకట్ అసహనం

Posted: 01/17/2018 10:33 AM IST
Kona venkat fire on mahesh kathi

పవన్‌ కల్యాణ్‌ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి విదితమే. టీవీచర్చలు వాదప్రతివాదాలకు దారితీస్తూ.. మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్‌ మళ్లీ ట్వీట్ చేశారు. గతంలో ఆయన కత్తి మహేష్ ను, పవన్ ఫ్యాన్స్ ను మౌనంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ టీవీ చర్చల్లో కత్తి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తనకు బెదిరింపులు మరింతగా పెరిగిపోయాయని కత్తి మహేష్ ట్వీట్ చేశాడు. ‘ఎక్కడ ఉన్నారు సార్‌? నేను మౌనంగా ఉన్నా.. పవన్‌ కల్యాణ్‌, అతని అభిమానుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నా నుంచి నా కుటుంబానికి ఈ దాడులు విస్తరించాయి. నేనేం చేయాలో ఇప్పుడు చెప్పండి’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కోన ఘాటుగా స్పందించారు.

‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్‌ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్‌లో పాల్గొన్నావు. పీకే, అతని అభిమానుల మీద దాడి చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలను కలిశావు. మౌనం అంటే నీ నిఘంటువులో వేరే అర్థం ఉందా’ అని ప్రశ్నించారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక సినీ పెద్దలు ప్రయత్నించినప్పటికీ.. కత్తి చేష్టలతోనే అది విఫలమైందన్న వాదన వినిపిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles