Mega Star Confirmed for Chalo Pre Release Event Guest | కన్ఫర్మ్.. శౌర్య కోసం చిరు

Chiru chief guest for chalo event

Chiranjeevi, Chalo Movie, Pre Release Event, Naga Shourya, Rashmika Mandanna, Chalo Pre Release Event

Megastar Chiranjeevi is going to attend the Pre-release event of upcoming movie ‘Chalo’ starring Naga Shourya and Kirik Party fame Rashmika Mandanna. It is heard that recently Naga Shourya visited Chiru’s house along with his mother and requested him to attend the pre-release event. Chiru who is very impressed with the film’s trailer, gave his nod immediately to attend the event that will take place on 25th January 2018 in Hyderabad.

ఛలో ప్రీ రిలీజ్ కి చిరు చీఫ్ గెస్ట్

Posted: 01/24/2018 03:28 PM IST
Chiru chief guest for chalo event

యువ కథానాయకులలో నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ... గత కొంత కాలంగా సక్సెస్ రేటు లేకుండా పోయింది. తాజాగా శౌర్య హీరోగా 'ఛలో' చిత్రం తెరకెక్కింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కన్నడ క్రేజీ బ్యూటీ రష్మిక మందన కథానాయికగా నటించింది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 25వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు జరపనున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతూ ఉండటం విశేషం. చిత్ర రషెస్ చూసిన చిరుకి చిత్రం తెగ నచ్చటంతో హాజరయ్యేందుకు వస్తున్నాడంట.

 

నాగశౌర్య సొంత బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి, మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. తెలుగు-తమిళ సరిహద్దు గొడవ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అయి తీరుతుందని శౌర్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles