Amid Protests Padmaavat crosses Rs 50 crore mark | పద్మావత్ కి క్యూ.. కలెక్షన్లు రెండు పెరిగాయ్

Padmaavat collections increased

Padmaavat, Padmaavat Collections, Padmaavat Tarun Adarsh, Padmaavat Collections Deepika Padukone, Padmaavat Surprise Collections

Padmaavat box office day 2 Collections Report. Despite fear of violence, viewers help Deepika Padukone's film earn Rs 56 crore,

పద్మావత్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

Posted: 01/27/2018 04:32 PM IST
Padmaavat collections increased

ఓవైపు పద్మావత్ చిత్రం విడుదల కాగా.. కర్ణి సేన నిరసనలు కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. మరి ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంది అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది కదా. అది నిర్ధారించేందుకే కలెక్షన్ల గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ మూవీ ట్రేడ్ అనాలిస్ట్ తరుణ్ ఆదర్శ్ రివ్యూ కలెక్షన్ల గురించి చెప్పేశారు.

బుధవారం ప్రీమియర్ల షోలతో ఈ చిత్రానికి 5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. గురువారం 19 కోట్లు రాబట్టింది. ఇక శుక్రవారం హాలీడే కలిసి రావటంతో ఏకంగా 32 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తం మీద 56 కోట్లతో పద్మావత్ మంచి వసూళ్లనే రాబట్టిందని చెప్పొచ్చు. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో పద్మావత్ విడుదల కాలేదు. పైగా క‌ర్ని సేన విధ్వంసాల నేపథ్యంలో చాలా మంది తొలి రెండు రోజులు థియేటర్ల వైపు చూసేందుకే భయపడ్డారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి కాస్త మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో?

ఈ వ‌సూళ్ల గురించి సినిమాలో ప‌ద్మావ‌తి పాత్ర‌లో న‌టించిన దీపికా ప‌దుకునే ట్వీట్ ద్వారా స్పందించింది. 'బూమ్' అంటూ పిడికిలి గుర్తు ఎమోజీని ఆమె ట్వీట్ చేసింది. సుమారు 200 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కగా మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పట్లో బాలీవుడ్ లో పెద్ద చిత్రం లేకపోవటంతో వసూళ్లు పెరగొచ్చనే చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles