Mega Star Big Help to Medical College Building | మెగా సాయానికి థ్యాంక్స్ చెప్పిన సీనియర్ నటుడు

Chiranjeevi donates 1 crore to medical college

Chiranjeevi, Doantes, Murali Mohan. MPLADS Funds, Allu Ramalingaiah Government College, Medical College Building, Homeopathy College

Megastar Chiranjeevi Donation of Rs 1 Crore to a homeopathy college. Chiru gives that amount from MPLADS(Members of Parliament Local Area Development Scheme) to Dr. Allu Ramalingaiah Government Homeopathic Medical College Building at Gandhipuram, Rajahmundry. Actor, MP Murali Mohan later meet Chiru Personally and Thanks him.

కాలేజీ భవనం కోసం మెగాస్టార్ భారీ సాయం

Posted: 02/21/2018 12:46 PM IST
Chiranjeevi donates 1 crore to medical college

మెగాస్టార్ చిరంజీవి కళా రంగానికే కాదు.. సాంఘిక సేవలకు కూడా ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలూ సాయం చేసేస్తుంటారు. ప్రస్తుతం ఆయన మరో భారీ సాయంతో వార్తల్లో నిలిచారు. ఓ మెడికల్ కాలేజీ కోసం ఆయన కోటి రూపాయల నిధులను అందించారు.

వివరాల్లోకి వెళ్తే... రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజీ కోసం ఆయన ఈ సాయం చేశారు. మెడికల్ కాలేజ్ కొత్త భవనం నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి రూపాయలను అందించారు. దీనిపై తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ... చిరంజీవికి రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. స్వయంగా మురళీమోహన్ చిరు ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు చెప్పారు. కాలేజీకి ఇక ముందు కూడా ఎలాంటి సాయం కావాలన్న తాను ముందుంటానని ఈ సందర్భంగా చిరు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు మెగాస్టార్ సైరా రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరు గురువు పాత్ర గోసాయి వెంకన్న గా కనిపించనున్నారు.

Chiru Help Murali Mohan Thanks

చిరుకు పుష్ప గుచ్ఛం అందిస్తున్న మురళీ మోహన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles