తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని దశాబ్దాలపాటు చిత్రపరిశ్రమను ఏలిన ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అకస్మాత్తుగా గుండెపోటు
బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా వివాహం కోసం శ్రీదేవి, తన భర్త బోనీకపూర్, చిన్న కుమార్తె ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లారు. పెళ్లిలో అప్పటివరకు సంతోషంగా గడిపిన శ్రీదేవికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బాత్రూమ్లో పడిపోయి అపస్మారస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను బంధువులు వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని భారత కాన్సులేట్ జనరల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఇక ఆమె మరణ వార్తను సంజయ్ కపూర్ ధ్రువీకరించారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన ప్రముఖులు ఆమె ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ‘దడాక్’ చిత్ర షూటింగ్ కారణంగా ముంబైలోనే వున్న శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి విషయం తెలిసిన వెంటనే దుబాయ్ వెళ్లిపోయినట్టు సమాచారం. శ్రీదేవి మరణవార్తతో మొత్తం సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది.
నాలుగేళ్ల వయసులో బాలనటిగా...
శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13, 1963న జన్మించారు. అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో అంటే నాలుగేళ్ల వయసులోనే ‘కనదన్ కరుణాయ్’ అనే చిత్రంలో బాలనటిగా తొలిసారి నటించింది. 1976లో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘మాండ్రు ముడిచు’ అనే సినిమాలో కమలహాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించింది. ఈ సినిమాతో శ్రీదేవి ప్రభ వెలిగిపోయింది. స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్’లలో తొలిసారి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక దశలో తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలను ఏలారు. 1975-85 మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు.
అంతేకాదు.. రెండు తరాల హీరోలతో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఆమెను సినీ లోకం ముద్దుగా ‘అతిలోక సుందరి’గా పిలుచుకుంటుంది. బోనీకపూర్‌తో వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన శ్రీదేవి 2012లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ‘మామ్’ అనే సినిమాలోనూ నటించారు. చివరగా షారూఖ్ జీరో చిత్రంలో ఆమె ఓ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. శ్రీదేవి తన నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2013లో భారత అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని అందుకున్నారు. నాలుగుసార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ అవార్డులను శ్రీదేవి అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ సరసన నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు.
54 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆమె మరణించారన్న వార్తను సినీ ప్రపంచమే కాదు, అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమాన నటి మరణవార్త తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతికి పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
#Sridevi last dance in wedding in Dubai #RIPSridevi #sridevinomore pic.twitter.com/o3xTWfwucr
— Vinod Mudhiraj (@muraricool4) February 25, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more