సోషల్ మీడియాలో ఎక్కడో ఓ వార్త పుట్టుకు రావటం.. దాని ఆధారంగా ఓ కథనాన్ని అల్లేసి వైరల్ చేస్తుండటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అయితే అలాంటి తలా తోక లేని వార్తలతో పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి.
తాజాగా సాయి ధరమ్ తేజ్ కరుణాకరణ్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి ఈ మధ్య టైటిల్ ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపించాయి. దేవుడు వరమందిస్తే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ కథనాలు వెలువడగా.. ప్రముఖ పత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి. కొందరైతే ఏకంగా లోగోలు డిజైన్ చేసి వైరల్ చేసేశారు.
అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని స్వయంగా తేజూనే వెల్లడించాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఏ టైటిల్ ను అనుకోలేదనీ .. త్వరలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. మొత్తానికి ఇన్ అండ్ యాజ్ పేరుతో వేసిన టైటిల్ తేజూకు చిరాకు తెప్పించిందనే చెప్పుకోవాలి.
Hi guys, there has been speculation in regards to the title of my next film. The one that has been doing the rounds is “NOT” the title. The title will be announced soon... Thank you (in & as )
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 13, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more