బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అస్వస్థత కారణంగా ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ షూటింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా అమీర్ ఖాన్ నటిస్తుండగా, కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో వయోధికుడి పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడంటూ ఓ ఫోటో తాజాగా నెట్ లో వైరల్ అవుతోంది.
అయితే వాస్తవ రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా ఉన్న ఆ ఫోటో అసలు బిగ్ బీ ది కాదన్న విషయం ఇప్పుడు బయటపడింది. 2014లో స్టీవ్ మెక్ కర్రీ అనే ఫోటో గ్రాఫర్ అఘ్ఘన్ శరణార్థిని తీసిన ఫోటో. దానిని ఇప్పుడు వైరల్ చేస్తూ అదే అమితాబ్ ఫోటో అంటూ కొందరు కథనాలు అల్లేస్తున్నారు. వాస్తవంగా సెట్స్ లో ఉన్న ఫోటోలు కొన్ని ఆ మధ్య లీక్ అయ్యాయి కూడా.
ఇక ఈ సినిమాలో అమీర్ లుక్ బయటకు రావడం అది ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం తెలిసిందే. అమీర్, అమితాబ్ కాంబినేషన్ కావడంతో థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జోధ్ పూర్ లో షూటింగ్ జరుగుతుండగా.. బిగ్ బీ అస్వస్థతో షూటింగ్ వాయిదా పడింది.
Afghan refugee from the amazing Steve McCurry Afghan show @Beetleshuxley He is the Cartier Bresson of our day. pic.twitter.com/Tc6ELsyJuw
— William Dalrymple (@DalrympleWill) April 25, 2014
Big B from sets of #ThugsOfHindostan pic.twitter.com/8NSIPsklcs
— Arpeet Gangar (@Arpeet009) March 10, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more