pawan kalyan tollywood fans gave befiitting reply to sri reddy పవన్ కల్యాన్ సీనీ అభిమానగణం.. ఏమన్నారో తెలుసా..?

Pawan kalyan tollywood fans gave befiitting reply to sri reddy

pawan kalyan, janasena, pk fans, tollywood fans, varun tej, sai dharam tej, nitin, sampoornesh babu, pawan kalyan viral video, janasena activists, casting couch, kathua, asifa, unnao, viral videos, videos viral, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan fans of tollywood gave befitting reply to sri reddy.

పవన్ కల్యాన్ సీనీ అభిమానగణం.. ఏమన్నారో తెలుసా..?

Posted: 04/17/2018 06:51 PM IST
Pawan kalyan tollywood fans gave befiitting reply to sri reddy

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఇందుగలరు.. అందులేరు అన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కనబడు అన్నట్లుగా స్వతహాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న వారు కూడా అయన అభిమానులే అనడంలో సందేహం వలదు. ఈ ఉదంతంపై ఇప్పటికే వరుణ్ తేజ్, నితిన్, సంపూర్ణేష్ బాబు లాంటి స్టార్స్ స్పందించగా.. తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా తనదైన స్టైల్‌లో స్పందించాడు. ట్విట్టర్ వేదికగా పవన్ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేసి విమర్శకులందరికీ సమాధానం చెప్పాడు.
 
ఈ వీడియోలో పవన్ తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ‘‘కష్టాలుంటాయ్.. పాలిటిక్స్‌లో.. నన్ను తిడుతుంటే ఒక్కోసారి మీకు ఇబ్బంది కలగొచ్చు. నేను భరిస్తాను.. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం.. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. అంతేగానీ మాట అనేసారు కదా అని పారిపోతే ఎట్లా.. అలా అయితే నిన్ను తిట్టేవారు విజయం సాధించినట్లు. అలా పారిపోవద్దు దేన్నుంచి. అలా అనిచెప్పి ఎదురుదాడి చెయ్యొద్దు. భరించండి.. చూడండి.. ఎంతసేపంటారో చూడండి. మార్పు చాలా సైలెంట్‌గా అదే వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చేశక్తి చాలా బలమైన శక్తి మన లోపలినుంచి’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవ్వడమేగాక పలు చర్చలకు తావిస్తోంది.

అంతకుముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇదే తరహాలో తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ‘‘నీ గురించి విమర్శంచి.. నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అటువంటి వాళ్లు వాళ్ల బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హీరో నితిన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. "For every action there is an equal and opposite reaction...just wait for it....its coming!!!" అని ట్వీట్ పెట్టాడు. గత రెండు రోజులుగా టాలీవుడ్ మహిళా నటులు, ముఖ్యంగా శ్రీరెడ్డికి, పవన్ ఫ్యాన్స్ కూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, నితిన్ ఈ ట్వీట్ పెట్టడం గమనార్హం.

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు విని తన మనసు చాలా బాధపడిందని నటుడు సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ పెడుతూ, జనసేన అధినేత పవన్ ను, ఆయన తల్లిని నిందించడం సరికాదని అన్నాడు. "పవన్ కల్యాణ్ గారిని, వారి తల్లిని కొందరు నిందించటం మనసుకి బాధ కలిగిస్తోంది. సభ్య సమాజం దీన్ని హర్షించదు. సాటి మహిళని గౌరవించలేనప్పుడు ఈ పోరాటంలో అర్థమే లేదు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా" అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles