టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలిస్ స్టెషన్ లో పిర్యాదు చేశారు. అమీర్‌పేటలో లేడీస్ హాస్టల్లోని అమ్మాయిలను తాను రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని.. తాను బ్రోకర్ గా వ్యవహరిస్తున్నానని, తన భర్త అమ్మాయిల పిచ్చోడని అరోపించిన క్రమంలో సంద్యపై అమె ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ పై చర్చ అసహ్యంగా మారిందని అన్నారు.
ఈ చర్చాగోష్టికి తనను మాట్లాడడానికి రమ్మని పిలిచినా వెళ్లలేదని అమె అన్నారు. అసలు ఎవరికి ఏం కావాలని ఫైట్ జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. కొన్ని రోజుల ముందు తాను మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్ చూశానని, సామాజిక కార్యకర్త సంధ్య ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై నీచమైన ఆరోపణలు చేశారని అన్నారు. సంధ్య మహిళల సంఘం నేతగా వ్యవహరిస్తూ మరో మహిళ గురించి అత్యంత నీచంగా ఎలా అరోపణలు గుప్పిస్తుందని అమె ప్రశ్నించారు. తాను హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని ఆమె అందని, మహాన్యూస్‌లో మూర్తి అనే ఎడిటర్ ఆ చర్చ జరిపేసి, దానినే కంక్లూజన్ గా చేసి ముగించారని అమె అవేదన వ్యక్తం చేశారు.
మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఏ చర్చలకైనా వెళ్లండి కానీ తన గురించి, తన భర్త గురించి, తన కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అమె ప్రశ్నించారు. తనకు కూడా ఇద్దరు కూతుళ్లు వున్నారన్న విషయం సంథ్య మర్చిపోతున్నారని.. రాజశేఖర్ కుటుంబం అంటే ఐఏఎస్, ఐపీఎస్‌ల కుటుంబమన్నారు. మాపై వేసిన ఆ ఆరోపణలను రుజువు చేయాల్సిందే. ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి. సంధ్యకు సెలబ్రిటీలంటే అసలు ఇష్టం లేదన్న భావన కనిపిస్తుందని విమర్శించారు.
సెలబ్రిటీల గురించి ఎన్నో సార్లు సంధ్య ఇటువంటి వ్యాఖ్యలు చేసింది, సినిమా వాళ్లంటేనే ఆమె ఛీప్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తమాషాగా ఉందా, మమ్మల్ని చూస్తే? మా కుటుంబంపై చేసిన అరోపణలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. టీవీల్లో డిబేట్లు పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడితే తాను ఇక ఊరుకోనని జీవిత రాజశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. . 'ఎవ్వరూ అడగరనుకుంటున్నారా? మిమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ లేరనా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.. చేతులకి గాజులు తొడుక్కుని కూర్చోలేదని మీడియాను కూడా హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more