Prabhas busy with action scenes in Dubai దుబాయ్ లో ప్రభాస్ బైక్ చేజింగ్..

Prabhas spotted on triumph street triple rs during sahoo shoot

baahubali, bollywood, Prabhas, sahoo, Sahoo Shoot, Shraddha Kapoor, Spotted, SS Rajamouli, Street Triple, Superbike, Tollywood, Triumph, Triumph Street Triple, Triumph Street Triple RS news, action scenes, dubai, shraddha kapoor, Shreyas Media, Sujeeth, movies, tollywood, bollywood, entertainment, latest news

Tollywood Star of Baahubali fame Prabhas has been seen on a Triumph Street Triple at the sets of Sahoo in Dubai – a movie that also features Bollywood star Shraddha Kapoor.

బ్రిటీష్ కంపెనీ బైక్ తో దుబాయ్ లో ప్రభాస్ చేజింగ్..

Posted: 05/02/2018 07:55 PM IST
Prabhas spotted on triumph street triple rs during sahoo shoot

‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ వంటి బ్లాక్ బస్టర్‌ చిత్రాల తరువాత హీరో ప్రభాస్ పై అంచనాలు పెరిగాయి. అభిమానులు ఆయనపై బాహుబలికి మించిన అంచనాలు పెట్టుకోగా, తాజాగా సుజిత్ దర్శకత్వంలోనే నటిస్తున్న ప్రభాస్ ఆయన రూపొందిస్తున్న సాహో చిత్రం కోసం శ్రమిస్తున్నాడు. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్.‌ హాలీవుడ్‌ స్టంట్‌ లెజెండ్‌ కెన్నీ బేట్స్‌ సారధ్యంలో షూట్‌ జరుగుతోంది. 250 మంది యూనిట్‌ సభ్యులతో 50 రోజులపాటు అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోన్న అతి పెద్ద రెండో సినిమా ‘సాహో’ కావడం విశేషం అంటున్నారు. ‘టైగర్‌ జిందా హై’ తర్వాత భారీ స్థాయిలో అక్కడ చిత్రీకరణ జరుపుకుంటోన్న అతి పెద్ద సినిమా ఇదేనని సమాచారం. ఈ షూట్ సందర్భంగా ప్రభాస్ ప్రముఖ బ్రిటీష్ కంపెనీకి చెందిన ట్రింఫ్ స్ట్రీట్ ట్రిఫుల్ అర్ఎస్ బైక్ తో కనిపించిన ఫోటోలు ఇప్పడు వైరల్ అవుతున్నాయి

ఈ ఫోటోలను శ్రియాస్ మీడియా తన ఫోస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేయడంతో అభిమానులు వాటిని షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఈ బైక్ తో ప్రభాస్ చేజింగ్ సీన్ లో నటిస్తున్నాడని కూడా ఊహించేస్తున్నారు. ‘‘ఇక్కడ షూటింగ్‌ జరపడం విశేషమని చిత్ర పరిశ్రమలోని నా స్నేహితులు అన్నారు. ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని, సినిమా స్థాయిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి అధికారులు, ప్రభుత్వం, ప్రజలు, అభిమానుల నుంచి మాకు అందుతున్న సహాయం చూశాక నేను చాలా ఇంప్రెస్‌ అయ్యాను. సినిమా షూటింగ్‌ సజావుగా జరగడానికి వీరంతా తోడ్పడుతున్నారు’’ అని ప్రభాస్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  sahoo  action scenes  dubai  shraddha kapoor  Shreyas Media  Sujeeth  movies  tollywood  bollywood  entertainment  

Other Articles