విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా రూపొందిస్తున్న క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్.. యూరోప్ వెళ్లుందట. నటి త్రిష కూడా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో కీర్తి సురేష్ ఏ ప్రాత పోషిస్తుంది.? ఈ ప్రశ్నలు పక్కనబెడితే.. ఈ చిత్ర హీరో విక్రమ్ తో కలసి కీర్తి సురేష్ యూరోప్ వెళ్లనుంది.
ఎందుకోసం అనుకుంటున్నారు.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ డ్యూయట్ పాటను చిత్రీకరించేందుకని సినీ బృందం యూరోప్ పర్యటించనున్నారు. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ కనిపించే ఈ సినిమా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోందని చిత్ర నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో హరి .. విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'కారై కుడి'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. విక్రమ్ కి .. కీర్తి సురేశ్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉండటం వలన, తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఇటీవల పెద్దగా హిట్ చిత్రాలు లేని విక్రమ్ అశలన్నీ ఈ చిత్రంపైనే వుండగా, మహానటి చిత్రంతో దూసుకుపోతున్న కీర్తి.. ఇమేజ్ ఈ చిత్రానికి ఎంతలా దోహదపడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more