Prabhas Bids Bye To Dubai Schedule ‘సాహో’లో ప్రభాస్ విలన్ ఫస్ట్ లుక్ చూసేయండి.!

Sahoo villian neel nithin mukesh first look released

prabhas, Shraddha Kapoor, bahubali, sahoo, villain, neel nithin mukesh, first look, action, chasing shoot, abudabi, dubai, ss rajamouli, sujeeth, Vamsi, Pramod, UV Creations, telugu cinema, movies, tollywood, entertainment

Prabhas and his team had wrapped-up busy shooting for their new film titled Sahoo in Dubai. Which included action sequences and a chase sequence involving luxury cars and bikes.

‘సాహో’లో ప్రభాస్ విలన్ ఫస్ట్ లుక్ చూసేయండి.!

Posted: 05/21/2018 05:21 PM IST
Sahoo villian neel nithin mukesh first look released

‘బాహుబలి’, బాహుబలి-2 చిత్రాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా.? అంటూ ఏకంగా అఖిల భారత ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రభాస్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సాహో. బాహుబలి ద్వారా చిత్ర దర్శకుడు రాజమౌలి ప్రభాస్ లోని మరో కోణాన్ని చూపించగా.. అందుకు భిన్నమైన కోణంలో ప్రభాస్ సాహో చిత్రంలో కనిపించనున్నాడు. రాజుల కాలం నాటి పౌరాణిక చిత్రంతో ప్రభాస్ నటనను చూపించాడు దర్శకదిగ్గజడు రాజమౌళి.

అయితే పౌరాణికానికి పూర్తి భిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రంగా ప్రభాస్ సాహో వుంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్ సాహోపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా కపూర్ ప్రభాస్ కు జోడీగా నటిస్తుంది. ‘బాహుబలి’ సినిమాతో తన మార్కెట్ పెంచుకున్న ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో ఇండియా వైడ్ మార్కెట్ ను సంపాందించుకునేందుకు ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను ప్రభాస్ కు విలన్ గా ఎంపిక చేశాడు సుజీత్. లేటెస్ట్ గా విలన్ నీల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

విలన్ పాత్ర ఎంత బలంగా వుంటే అప్పడే హీరో పాత్రకు అంతటి ప్రాధాన్యం చేకూరుతుందన్న విషయం తెలిసిన డైరెక్టర్ సుజీత్.. సాహో చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్ ను ఎంచుకున్నాడు. కత్తి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన విలన్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ఎలా కనిపిస్తాడన్నది ఇవాళ దర్శకుడు సుజిత్ ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేశాడు. గుబురుగడ్డంతో, పదునైన చూపులతో వున్న విలన్ పోటోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో ప్రభాస్ తో పాటు నీల్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ దాదాపుగా చివరి అంకానికి చేరకుంది. ఈ వారంలో దుబాయ్ వెళ్లిన సాహో బృందం భారత్ కు తిరిగివస్తారని కూడా సమాచారం.

హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో కనిపించే తరహాలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా భారీ ఛేజింగ్ సీన్ ఒకటి రీసెంట్ గా చిత్రీకరించారు. ఈ ఛేజింగ్ సీన్ కోసం 37 ఖరీదైన కార్లను .. 4 భారీ ట్రక్కులను ఉపయోగించారు. ఛేజింగ్ లో కార్లు .. ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొడుతూ ధ్వంసమవుతూ ఉంటాయి. దీనిని బట్టి ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారన్నది అర్థం  చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ లో బైక్ పై ప్రభాస్ చేసే విన్యాసాలు చూసి తీరవలసిందేనని అంటున్నారు. ఇక విలన్ లుక్ తో సాహోపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. సాహోలో వారిద్దరు తలపడే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని సినిమా టీం చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  Shraddha Kapoor  sahoo  villain  neel nithin mukesh  first look  sujeeth  tollywood  entertainment  

Other Articles