సవ్యసాచి చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా గడిపిన నాగ చైతన్య.. కాసింత విరామం కూడా లేకుండా అప్పుడే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శైలజా రెడ్డి అల్లుడు చిత్ర షూటింగ్ లో బిజీకానున్నాడు. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపోందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ 'శైలజా రెడ్డి’గా కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 50 శాతం చిత్రీకరణకు పక్కాగా ప్లాన్ చేశారు.
ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ షూటింగును జరపనున్నారు. 15 రోజుల పాటు ఇక్కడ చిత్రీకరణ కొనసాగుతుంది. సొగసరి అత్తగా .. గడసరి అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ .. చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వున్నాయి. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఆ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను .. ఆగస్టు చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more