Ramya Krishna wraps up her part in quick time శైలజారెడ్డి అల్లుడికి ఫ్యాకఫ్ చెప్పిన రమ్యకృష్ణ..

Ramya krishnan wraps up shoot for shailaja reddy alludu

Shailaja Reddy Alludu, Ramya Krishnan, Naga Chaitanya, Maruthi, Anu Emmanuel, Savyasachi, Samantha, Ninnu Kori, Shiva Nirava, movies, entertainment, tollywood

Ramya Krishnan has wrapped up shoot for her upcoming film ‘Shailaja Reddy Alludu’ under the direction of Maruthi and starring Naga Chaitanya and Anu Emmanuel in lead roles.

శైలజారెడ్డి అల్లుడికి ఫ్యాకఫ్ చెప్పిన రమ్యకృష్ణ..

Posted: 07/19/2018 06:05 PM IST
Ramya krishnan wraps up shoot for shailaja reddy alludu

బాహుబలి చిత్రంలో తన నటనతో అఖిలభారత ప్రేక్షకులను రంజింపజేసి.. మన్ననలు పోందిన రమ్యకృష్ణకు.. ఇక టీవీ సిరియళ్లుకు ఫుల్ స్టాప్ పెట్టి.. పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించేలా వచ్చేశాయట ఆఫర్లు. ప్రస్తుతం అమె మారుతి దర్శకత్వంలోని 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో అత్త పాత్రలో అభినయించనుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య.. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.

'శైలజా రెడ్డి'గా రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తుండగా, అమెకు అల్లుడిగా నాగచైతన్య నటించనున్నాడు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు అత్తా అలుళ్లల మధ్య సాగే డ్రామాలు అనేకం చూసినా.. ఈ చిత్రంలో మాత్రం కథా, కథనంలో విభిన్నంగా వుంటుందని అంటున్నాయి చిత్రవర్గాలు. అనూ ఇమ్మాన్యుయేల్ తల్లి పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ ఈ చిత్రానికి అప్పుడే ఫ్యాకఫ్ కూడ చెప్పేశారట. శైలజారెడ్డికి సంబంధించిన పాత్రలో నటించిన రమ్యకృష్ణ దానిని పూర్తి చేశారు. దీంతో తన పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తైన నేపథ్యంలో చిత్ర డైరెక్షన్ టీమ్ తో అమె ఫోటోలను దిగారు.

ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. రమ్యకృష్ణతో కలిసి దిగిన ఒక సెల్ఫీని పోస్ట్ చేశాడు. రమ్యకృష్ణ తన అభిమాన నటి అనీ .. ఆమె నటన అద్భుతమంటూ అభినందించిన మారుతి అమెతో దిగిన సెల్పీతో పాటు తమ దర్శకత్వ టీమ్ తో దిగిన ఫోటోలను కూడా అప్ లోడ్ చేశాడు. అహంభావ శ్రీమంతురాలి పాత్రలో.. అందులోనూ అత్తగారు పాత్రలో అదరగొట్టేయనున్నారు. ఈ తరహా పాత్రలను పోషించిన వాణిశ్రీకి వారసురాలిగా రమ్యకృష్ణ ఎలా అకట్టుకుంటారన్న అసక్తి అందరిలోనూ రేకెత్తుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shailaja Reddy Alludu  Ramya Krishnan  Naga Chaitanya  Maruthi  Anu Emmanuel  tollywood  

Other Articles