Naga Shaurya has no feelings for women హాస్యంతో మెప్పిస్తానంటున్న బృహన్నల

Naga shaurya plays brihannala role in nartanasala

Nartanasala nartanasala teaser nartanasala songs nartanasala first look nartanasala fresh look nartanasala motion poster naga shaurya new movie nagashourya @NartanasalaMovie nartanasala audio nartnasala audio launch nartanasala promos narthanashala nartanashala nartanashala Teaser, Nartanasala Trailer, tollywood

Actor Naga Shaurya home banner ira creations released his latest movie with comedy and fun filled entertainer '@Narthanasala' teaser today. in which Young actor plays the role of Present day brihannala

హాస్యంతో మెప్పిస్తానంటున్న నర్తనశాల అర్జునుడు

Posted: 08/08/2018 06:01 PM IST
Naga shaurya plays brihannala role in nartanasala

నందమూరి తారక రామారవు నటించిన నర్తనశాల టైటిల్ ను ఎంచుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ఈ చిత్రంతో మంచి హిట్ అందుకోవాలన్న యోచనలో వున్నాడు. తన సొంత ప్రోడక్షన్ ఇరా క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మహాభారత పర్వంలోని అజ్ఞాతవాసంతో అర్జునుడు పోషించిన బృహన్నల పాత్రను తాను అభినవ బృహన్నలగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 'ఛలో' సినిమా హిట్ తరువాత వైవిధ్యభరితమైన కథతో వస్తున్న నాగశౌర్య అన్నగారి టైటిల్ 'నర్తనశాల' తో వస్తున్నాడు.

శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన కశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, హాస్య ప్రధానంగా కొనసాగింది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలా పెంచబడిన హీరో .. అమ్మాయిలకి దూరంగా ఉంటూ వుంటాడు.

ఈ సరదా కథాంశంతోనే ఈ సినిమా కొనసాగుతుందనే విషయం ఈ టీజర్ వలన స్పష్టమవుతోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా .. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా తనకి మరో హిట్ ను ఇస్తుందనే ఉద్దేశంతో నాగశౌర్య వున్నాడు. ఇక కథానాయికలిద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles