Kalyanram Is Looking To Take A Big Risk సముద్రంలో భారీ ఫైట్.. ఆ రోజునే ఫస్ట్ లుక్

Kalyan ram has to pull off underwater stunt

Kalyan Ram, Nandamuri Kalyan Ram, underwater stunt, big fight scene under water, telugu cinema, Vinayaka chavithi, Guhan, Mahesh Koneru, movies, entertainment, tollywood

Nandamuri Kalyanram is taking a huge risk for his next film. Cinematographer Guhan turned into a director with this film and almost 90% of the shoot is over. For the fight, hero has to pull off underwater stunts and the team is planning to pull it off in Vizag, it seems.

సముద్రంలో భారీ ఫైట్..ఆ రోజునే ఫస్ట్ లుక్

Posted: 08/27/2018 03:27 PM IST
Kalyan ram has to pull off underwater stunt

ఫటాస్ చిత్రం తరువాత విజయలక్ష్మి కరుణకటాక్షల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా హీరో కళ్యాణ్ రామ్. తన కృషిలో లోపం లేకపోయినా మనసుకు నచ్చిన కథలు తెరమీదకు వచ్చేటప్పటికి ఫలితాలు తేడా కొడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు ఎమ్మెల్యే-నా నువ్వే తో పలకరించిన నందమూరి నటవారసుడికి హిట్ మాత్రం దక్కలేదు. అయినా తన ప్రయత్నలోపం లేకుండా తనమూడవ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నాడు కల్యాణ్.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ రచనా దర్శకత్వంలో, కోనేరు మహేష్ నిర్మాణసారథ్యంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రంలో కళ్యాణ్ రామ్ భారీ రిస్క్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 90 శాతం పూర్తైన ఈ చిత్రంలో కేవలం ఒక పాటు, ఒక ఫైటింగ్ సన్నివేశాలను మాత్రమే షూటింగ్ చేయాల్సింది వుంది. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ సాహసం చేయబోతున్నాడు.

కథలో భాగంగా వచ్చే ఒక కీలకమైన ఎపిసోడ్ కోసం దీన్ని వైజాగ్ సముద్రంలో తీయబోతున్నారు. ఇందుకోసం ఫారిన్ నుంచి డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ని కూడా పిలిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం డూప్ లేకుండా నిపుణుల సహాయంతో స్వంతంగా చేయడానికి డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇది యాక్షన్ నేపథ్యంలో వచ్చే  ఫైట్ సీన్ గా ఉంటుందని తెలిసింది. దీంతో పాటు ఇంకొక్క పాట షూట్ చేస్తే గుమ్మడి కాయ కొట్టవచ్చు. రెండు మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నా యూనిట్ ఫైనల్ గా ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. సెప్టెంబర్ 13 వినాయక చవితి పండగ సందర్భంగా దీని ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles