Ram Charan busy with Mega star's duties మెగా డ్యూటీస్ భుజాన వేసుకున్న చరణ్..

Ram charan busy with mega star chiru s duties

Rangasthalam, Ram Charan, Sukumar, Boyapati Srinu, chiranjeevi, upasana konidela, twitter, social media, allu ayaan, niece, movies, entertainment, tollywood

Ram Charan had completed his shooting part in the latest movie, which is yet to Release and had spending free time with his family and kids, as a part he had taken up his dad mega star Chiranjeevi's responsibilities.

మెగా డ్యూటీస్ భుజాన వేసుకున్న చరణ్..

Posted: 10/12/2018 05:46 PM IST
Ram charan busy with mega star chiru s duties

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం చిత్రం హిట్ అవ్వగానే.. మరో చిత్రంలో నటించేందుకు విదేశాలకు కూడా వెళ్లి తిరిగివచ్చన కొంత గ్యాప్ తీసుకుంటున్న చెర్రీ.. కాసింత ఖాళీ సమయం లభించగానే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేసే పనులనే చేస్తున్నాడట. ఈ విషయాన్ని బయటపెట్టిందో ఎవరో తెలుసా.. స్వయంగా అతని సతీమణి ఉపాసన కొణిదెల. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త మిస్టర్ సి గురించిన విషయాలను, సంగతులను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేస్తుంది అమె.

అందుకనే రాంచరణ్ కన్నా ఆయన గురించిన విషయాలను తెలుసుకునేందుకు చెర్రీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉపాసన ట్విట్టర్ అకౌంట్ నే ఫాలో అవుతారు. తాజాగా అమె పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని కొంత రిలాక్స్ అవుతున్న రామ్ చరణ్, తన కుటుంబ సభ్యులతో గడుపుతూ సేద తీరుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో వచ్చిన తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను చెర్రీ దగ్గరుండి ఘనంగా జరిపించాడు.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఉపాసన, "మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే" అని వ్యాఖ్యానించింది. రామ్ చరణ్ మేనకోడలితో పాటు అల్లు అర్జున్ కుమారుడు అయాన్, మరికొందరు చిన్నారులు ఈ పిక్ లో ఉన్నారు. చెర్రీ దగ్గరుండి మరీ తన మేనకోడలితో కేక్ కట్ చేయిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ పిక్ లో అయాన్, తదేకంగా కేక్ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుండగా, "అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌ పైనే ఉంది" అంటూ ఫ్యాన్స్ సరదా కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Boyapati Srinu  chiranjeevi  upasana konidela  twitter  social media  allu ayaan  niece  tollywood  

Other Articles