Rangasthalam scores record TRP Rating రాంచరణ్ ‘రంగస్థలం’ అక్కడ కూడా రికార్డే..

Ram charan rangasthalam creates record even on television

Rangasthalam, Ram Charan, Samantha Akkineni, Sukumar, village drama, TRP rating, Television, channel, Mytri Movie Makers, Devisri Prasad, Star Maa, Rangasthalam TRP Ratings, devisri prasad, Baahubali franchise, movies, entertainment, tollywood

Ram Charan’s Rangasthalam had struck the jackpot at the box office and it continued its successful run, having crossed 100 days, last week this movie had been telecasted on Television where it's trp rating crossed 19.5 says sources.

రాంచరణ్ ‘రంగస్థలం’ అక్కడ కూడా రికార్డే..

Posted: 10/25/2018 04:08 PM IST
Ram charan rangasthalam creates record even on television

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. రాంచరణ్ కు జంటగా నటించిన సమంతా కూడా అచ్చంగా పల్లెటూరు పడతిలా మెరిసి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అనేక ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించిన సుకుమార్.. చెర్రీ, సమంతలతో కలసి రూపోందించిన రంగస్థలం చిత్రానికి ప్రేక్షకులు ఎంతగా నిరాజనాలు పట్టారో మనకు తెలుసు.  

నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తలకిందలు చేస్తూ ఈ చిత్రం ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు ఈ మధ్యకాలంలో అతితక్కువ చిత్రాలు మాత్రమే సాధించే అరుదైన శతజయంతోత్సవ వేడుకను కూడా ఘనంగా జరుపుకుంది. సుకుమార్ కి గల ఇమేజ్ .. చరణ్ - సమంతకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. జగపతిబాబు .. అనసూయ పాత్రలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా రంగస్థలం రికార్డులను అందుకుంది. తొలిసారిగా క్రితం వారం బుల్లితెరపై రంగస్థలం చిత్రం ప్రసారమైంది. బుల్లితెరపై ఈ సినిమా 19.5 టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకోవడం విశేషం. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ విశేషమని చెబుతున్నారు. వెండితెరపైనే కాదు .. బుల్లితెరపై కూడా ఈ సినిమా తన సత్తా చాటుకుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  Samantha Akkineni  Sukumar  TRP rating  Television  channel  tollywood  

Other Articles