geeta govindam record high profits 'గీత గోవిందం'.. అరుదైన కలెక్షన్స్ రికార్డు

Geeta govindam another record in box office collections

geeta govindam, record collections, record profits, vijay devarakonda, rashmika mandana, parasuram, tollywood, latest movie news, movies, entertainment

Geeta Govindam is the movie which is produced under geeta arts 2 banner had earned huge profits at box office this year.

'గీత గోవిందం' అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రంగా రికార్డు

Posted: 10/25/2018 04:56 PM IST
Geeta govindam another record in box office collections

ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా సందడి చేశాయి. వసూళ్ల పరంగా దూసుకుపోయిన వాటిలో చిన్న సినిమాలు .. పెద్ద సినిమాలు కూడా వున్నాయి. పెట్టిన పెట్టుబడి .. వచ్చిన రాబడిని బట్టి చూస్తే, అత్యధిక లాభాలను రాబట్టిన చిత్రంగా 'గీత గోవిందం' కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'గీత గోవిందం' 55 కోట్లకి పైగా లాభాలను తెచ్చిపెట్టింది.

రెండవ స్థానంలో 'రంగస్థలం' కనిపిస్తోంది. చరణ్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా 43 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ జాబితాలో మూడవ స్థానంలో 'మహానటి' నిలిచింది. ఈ సినిమా 25 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇక నాల్గొవ స్థానంలో 'భరత్ అనే నేను నిలిచింది. కొరటాల దర్శకత్వంలో మహేశ్ చేసిన ఈ సినిమా 15 కోట్ల లాభాలను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఫుల్ రన్ లో 'అరవింద సమేత' ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో .. ఏ స్థానాన్ని ఆక్రమిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles