Ram Charan's double treat for Diwali ఆర్.సీ 12: ఫస్ట్ లుక్, టీజర్ లకు ముహూర్తం ఫిక్స్

Ram charan s next first look and teaser dates

Ram Charan, Boyapati Srinu, Kiara Advani, DVV Danayya, Ram Charan movie, Ram Charan first look, Ram Charan latest news, Ram Charan updates, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Ram Charan's double treat for Diwali: Ram Charan is busy with Boyapati Sreenu's film and the first look will be out for Diwali.

దీపావళికి డబుల్ ట్రీట్ ఇస్తున్న రాంచరణ్

Posted: 11/05/2018 09:01 PM IST
Ram charan s next first look and teaser dates

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది రామ్ చరణ్‌కు 12వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘ఆర్.సీ12’గా పిలుస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది.

ఈ నెల 6న (అంటే మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ‘RC12’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ఒక్కరోజు ముందు తేదీని ప్రకటించి మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, నవంబర్ 9న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. నవంబర్ 9న ఉదయం 10:25 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ తొలిసారి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఎక్కడా తక్కువ కాకుండా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ అజర్ బైజాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వివేక్ ఒబెరాయ్, రామ్ చరణ్‌పై అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. ఇదిలా ఉంటే, చరణ్-బోయపాటి సినిమా టైటిల్ గురించి గతంలో విపరీతమైన చర్చ జరిగింది. ఒకప్పటి చిరంజీవి బ్లాస్ బస్టర్ మూవీ ‘స్టేట్ రౌడీ’ టైటిల్‌ను చరణ్ సినిమాకు పెడుతున్నారని ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ తరవాత ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బహుశా రేపు ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమా టైటిల్ కూడా తెలిసిపోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Boyapati Sreenu  Kiara Advani  DVV Danayya  tollywood  

Other Articles