Mahesh Babu In Geeta Art's Movie అల్లు నిర్మాణంలో ఘట్టమనేని ప్రిన్స్..

Mahesh babu mb27 movie with director krish in geeta arts production

Mahesh Babu, Vamsi Paidipally, Krish, Geeta Arts production, Allu Aravind, sukumar, maharshi, mahesh babu 27, #MB27, movies, entertainment, tollywood

Currently Mahesh Babu is busy with 'Maharshi' after which he will be doing a movie in sukumar direction. But Mahesh had signed another project with krish.Allu Arvind will be producing this film and Krish is directing this movie.

గీతా అర్ట్స్ నిర్మాణంలో.. ప్రిన్స్ మహేష్

Posted: 11/09/2018 05:31 PM IST
Mahesh babu mb27 movie with director krish in geeta arts production

భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించి ప్రేక్షకులను మెప్పించి భారి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో కాలేజ్ విద్యార్థిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కావడం.. అందులో మహేష్ తుంటరి విద్యార్థిలా కనిపిస్తూ.. రోటిన్ కు భిన్నంగా తానే అమ్మాయిల వైపు వెనక్కి తిరిగి మరీ చూస్తూవుండటం ప్రేక్షకులకు కనువిందు చేసింది.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ తో పాటు పాటలు, పోస్టు ప్రోడక్షన్ పనులు జరుపుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూరైన తరువాత మహేశ్ బాబు.. సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే సుకుమార్ బిజీగా వున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మహేశ్ బాబు మరో సినిమాను కూడా పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.

అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా అర్ట్స్ ప్రోడక్షన్స్ లో రూపొందనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు వినిపించింది. కానీ తాజాగా క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. ఒక వైపున సాంఘిక చిత్రాలతోపాటు మరో వైపున చారిత్రక చిత్రాలతోను క్రిష్ తన సత్తా చాటుకుంటున్నారు. ఆయన చేతికి మహేశ్ ప్రాజెక్టును అల్లు అరవింద్ అప్పగించనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Vamsi Paidipally  Krish  Geeta Arts production  Allu Aravind  Tollywood  

Other Articles