రంగస్థలం చిత్రంతో నటుడిగా నూటికి వెయ్య మార్కులు వేసుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. ఆ తరువాత ఎలాంటి చిత్రంలో నటిస్తాడో.. స్టార్ ఇమేజ్ ను ఎలా నిలబెట్టుకుంటాడన్న నేపథ్యంలో.. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపోందిన వినయ విధేయ రామ చిత్రంతో వస్తున్నాడు చెర్రీ. అయితే ఈ చిత్రం టైటిల్ మాత్రమే వింటే ఇది కూడా రాంచరణ్ కూల్ సినిమా అని భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ చిత్రం నూటికి నేరుపాళ్లు మెగాఫ్యాన్స్ ను అలరించే యాక్షన్ ఓరియంటెండ్ చిత్రం.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే చిత్రంపై నెలకొన్న అంచాలను అభిమానుల్లో ఓ రేంజ్ కు చేరుకున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే.. చెర్రీ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ అన్నట్లుగా వుంది. ‘భయపెట్టాలంటే పది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట’.. అంటూ కత్తి దూస్తూ ఉగ్రరూపం దాల్చాడు రామ్ కొణెదల. దీపావళి పండగను పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. రామ్ చరణ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌తో అంచనాలను పెంచేసింది.
టైటిల్లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్‌లో వీరత్వాన్ని చూపించారు దర్శకుడు బోయపాటి. ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్‌తో జోడీకట్టిన బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వీ.వీ.ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ‘వినయ విధేయ రామ’ థియేటర్స్‌లో వీరత్వాన్ని ప్రదర్శించనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more