వైవిద్యభరితమైన కథలను ఎంచుకుని మరీ రోటీన్ కు భిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు హీరో సుమంత్. సుమంత్ హీరోగా రూపోందుతున్న 'ఇదం జగత్' సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం సుబ్రహ్మణ్యపురం అంచనాలకు తగ్గటుగా వసూళ్లను రాబట్టలేకపోయినా.. పరవాలేదని అనిపించుకుంది. అయితే తాజాగా విడుదల అవుతున్న ఇదం జగత్ చిత్రంపైనే ఆయన అశలు పెట్టుకున్నారు.
ఈ చిత్రంలో సుమంత్ కు జోడీగా అంజు కురియన్ నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ నీలకంఠం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్ర ట్రైయిలర్ ప్రేక్షకులను అకట్టుకుంటుంది. సినిమా కూడా అంచనాలకు తగ్గట్టుగా వుంటే సుమంత్ కు చాలా రోజుల తరువాత హిట్ దక్కినట్టే అవుతుంది. ఈ సినిమాను గురించి సుమంత్ ప్రస్తావించాడు."ఇది డార్క్ డ్రామా థ్రిల్లర్ గా నిర్మితమైంది. ఈ తరహా సినిమాను నేను చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నేను ఒక రిపోర్టర్ గా కనిపిస్తాను.
ఈ సినిమాలో నేను హీరోను అని గానీ .. విలన్ ను అని గాని చెప్పను. ఈ రెండింటికి అతీతంగా నా పాత్ర ఉంటుంది. ఒక రిపోర్టర్ స్వార్థపరుడైతే అతను ఏం చేయగలడు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రెస్ లోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో నేను ఒక ప్రయోగమే చేశాను. ఈ ప్రయోగం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more