NTR Kathanayakudu Movie latest Promo ఎన్టీఆర్ బయోపిక్: కథనాయకుడు రిలీజ్ ప్రోమో

Ntr kathanayakudu movie latest promo

NTRBiopic, NTRKathanayakudu, Nandamuri Balakrishna, Krish Jagarlamudi, kalyan ram, vidhya balan, sumanth, poonam bajwa, Rana Daggubati, tollywood, movies, entertainment

The first part of NTR’s biopic ‘NTR Kathanayakudu’ will be coming first into the theaters as Sankranthi festival treat. The unit has released a pre release promo today.

ఎన్టీఆర్ బయోపిక్: కథనాయకుడు రిలీజ్ ప్రోమో

Posted: 01/04/2019 06:28 PM IST
Ntr kathanayakudu movie latest promo

టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. విడుదలకు మరో ఐదురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ రిలీజ్‌ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ, విద్యాబాలన్‌‌లను హైలైట్ చేశారు.‌ ఎన్టీఆర్, బసవతారకం పాత్రధారుల్లో ఇద్దరూ పోటీ పడినటించారు. ‘

కంటపడని నీడై.. వెంట నడచు తోడై’ అంటూ సాగిన పాటలో.. ఎన్టీఆర్ కుటుంబాన్ని విడిచి సినిమాల కోసం మద్రాస్ రావడం.. హీరోగా ఎదగడం.. పెద్ద ఇళ్లు కట్టడం, భార్యకు నగలు కొనడం, పిల్లలు పుట్టడం.. లాంటివి సన్నివేశాలతో ఎన్టీఆర్-బసవతారకం అన్యోన్య దాంపత్యాన్ని ఇందులో చూపించారు. తాజాగా 'కథానాయకుడు' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను పొందడం విశేషం.

ఈ చిత్రంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్, హరిక్రిష్ణగా కళ్యాణ్ రామ్, నాగేశ్వరరావుగా సుమంత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, ‘టైగర్’ హెచ్.ఎం.రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, సంతోష్ తుండియల్ ఛాయాగ్రహణం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles