టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రంగా రూపోందుతున్న మహర్షి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెకే్కలా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం మహేష్ అభిమానుల హృదయాలలో ఎప్పటికీ ప్రతీ ఫ్రేమ్ లోనూ తనదైన అసక్తిని కనబరుస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుస్వరాల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలి టీజర్ తోనే చిత్రంలో మహేష్ విద్యార్థిగా కాలేజీలోకి వెళ్తూ.. రోటిన్ కు భిన్నంగా అమ్మాయిలను వెనక్కి తిరిగి మరీ చూస్తూ వెళ్లే టీజర్ అదరిపోయింది. అయితే మహేష్ కెరీర్ లో ఓ ముఖ్యచిత్రంగా దీనిని తెరకెక్కించి.. సంక్రాంతి బరిలో దింపేందుకు సన్నధం కాగా కొన్ని చిక్కులతో చిత్రాన్ని ఏప్రిల్ తొలివారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు.
అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీలో మళ్లీ మార్పు వచ్చిందని టాలీవుడ్ సర్కిల్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహర్షి విడుదల తేదీని ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోంది. మహేష్‌బాబు గత సినిమాలు పోకిరి, భరత్ అనే నేను ఏప్రిల్ చివరివారంలో విడుదలై భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా అదే సెంటిమెంట్ ప్రకారం మహేష్ కు అచ్చొచ్చిన ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు మహేష్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more