Allu Arjun all praise for Nani's Jersey నానీ.. నీ కెరీర్లోని జెర్సీ ది బెస్ట్ సినిమా: అల్లుఅర్జున్

Allu arjun all praise for nani s jersey call it his best performance

Stylish star Allu Arjun on Nani Jersey, Allu Arjun on Nani Jersey, Allu Arjun, Gautam Tinnanuri, Jersey, jr ntr, Nani, Trending In South, Trending In South, Jr NTR, Jersey, Nani, Shraddha Srinath, Anirudh, movies, entertainment, tollywood

Nani’s friend from the Telugu film industry praising his most recent release Jersey. After Young tiger Jr NTR and Manchu Manoj applause the movie, now Stylish star Allu Arjun too took to his Twitter account and couldn’t stop gushing about the film and the performances by its cast.

నానీ.. నీ కెరీర్లోl జెర్సీ ది బెస్ట్ సినిమా: అల్లుఅర్జున్

Posted: 04/20/2019 07:06 PM IST
Allu arjun all praise for nani s jersey call it his best performance

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన చిత్రం `జెర్సీ`. క్రితం రోజున విడుదలై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే ది బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి పాజిటివ్ టాక్ ను సోంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కూడా అదేస్థాయిలో రాబడుతున్న ఈ చిత్రం సామ‌న్యుల‌తోపాటు సినీ ప్ర‌ముఖుల‌ను సైతం ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మంచు మ‌నోజ్ వంటి హీరోలు `జెర్సి` సినిమాను ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా `జెర్సీ`పై ట్విట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపించాడు. అంద‌రూ క‌చ్చితంగా చూడాల్సిన చిత్ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. `ఇప్పుడే `జెర్సీ` చూశాను. హృద‌యాన్ని హ‌త్తుకునే అద్భుత‌మైన సినిమా. సినిమాలో ప్ర‌తీ సీన్‌ను ఆస్వాదించాను. చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు. నాని.. నువ్వు అద్భుతంగా న‌టించావు. ఇప్ప‌టివ‌ర‌కు నువ్వు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌. అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఈ చిత్రం నాని కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు నీ ఉత్త‌మ చిత్రంగా నిలుస్తుందని కూడా కొనియాడారు. ఇక‌, ముఖ్యంగా ఈ చిత్రం రూపోందించిన డైరెక్ట‌ర్ గౌత‌మ్ గురించి తప్పక చెప్పుకోవాలని.. చిత్రంలో ఎమోషన్స్ ను బాగా చిత్రీకరించాడని.. చాలా గొప్ప‌గా అన్ని తరగతుల వారిని ఆకట్టుకునేలా సినిమా తీశాడని ప్రశసించాడు. స్ట‌డీ అండ్ బోల్డ్. సినిమా ప్రేమికులంద‌రూ ఈ సినిమాను క‌చ్చితంగా చూడాల‌ని బ‌న్నీ ట్వీట్ చేశాడు. బ‌న్నీతోపాటు అల్ల‌రి న‌రేష్‌, మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి, సుధీర్‌బాబు, సుధీర్ వ‌ర్మ‌, డైరెక్ట‌ర్ మారుతి త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు ట్విట‌ర్ ద్వారా `జెర్సీ`ని ప్ర‌శంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Tinnanuri  Jersey  Allu Arjun  Nani  Shraddha Srinath  tollywood  

Other Articles