ఐదేళ్ల క్రితం దేశ రాజధానిలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన తరువాత ఈ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. నేరాలకు పాల్పడే బాలుర వయస్సులో సవరణలు.. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు ఇలా ఎన్ని తీసుకువచ్చినా.. నానాటికీ అబలలపై పైశాచిక మృగాలు తెగబడుతున్న ఘటనలు అధికమవుతున్నాయే కానీ.. తగ్గడం మాత్రం లేదు. ఇలాంటి ఘటనలపై అటు ప్రభుత్వాలు కూడా తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. నేరం చేసిన వారిని పట్టుకోవడం, న్యాయస్థానాల్లో నిలబెట్టడం పోలీసుల పని. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెబుతూ చేతులెత్తేస్తున్నారు.
ఒక్కప్పుడు అమ్మాయిలు రాత్రి వేళ బయట నుంచి ఇంటికి రాకపోతే అందోళన చెందే కుటుంబసభ్యులు.. ప్రస్తుతం గడపదాటిన ఆడపడచులు ఇంటికి వచ్చే వరకు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. మన నేతలు మాత్రం అర్థరాత్రిళ్లు అమ్మాయిలకు బయటకు వెళ్లే పనేంటి అంటూ అంక్షలు పెడుతున్నారే తప్ప.. పరస్త్రీ లక్ష్మీదేవితో సమానం అని మాత్రం ఎందుకు మగబిడ్డలకు బోధించడం లేదో అర్థంకాని ప్రశ్న. ఈ క్రమంలో బీహార్ లో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా అనేక మంది మండిపడుతున్నారు.
తాజాగా ఈ ఘటనపై యాంకర్, సినీ నటి రష్మి గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించగా, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనపై ట్విటర్ వేదికగా రష్మి మండిపడ్డారు. ‘రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికిపారేయాలి. లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి స్త్రీ జాతి విలువ తెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more